Bright Telangana
Image default

Jai Bhim: సూర్య ‘జై భీమ్‌’ టీజర్‌ చూశారా?

jai bhim telugu movie

Jai Bhim: టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో సూర్య నటించిన లీగల్‌ డ్రామా మూవీ ‘జై భీమ్’. ప్రకాశ్‌రాజ్‌, రావు రమేశ్‌ కీలక పాత్రలు పోషించారు. ఇందులో సూర్య లాయర్‌ పాత్రలో కనిపించారు. ఒక మహిళకు జరిగిన అన్యాయంపై చంద్రు అనే లాయర్‌ ఎలా పోరాటం చేశాడు? ఈ క్రమంలో ఆయనకు ఎదురైన అనుభవాలు ఏంటి? వాటిని ఎలా ఎదుర్కొని ఆ మహిళకు న్యాయం చేశాడన్నది మూవీ కథ. ‘బాధింపబడని వారికి లభించని న్యాయం. వాళ్లకు జరిగిన అన్యాయం కంటే దారుణంగా ఉంటుంది’, ‘దొంగలకు కూడా ఒక జాతి ఉంటుందా? నటరాజ్‌. నీ జాతిలోనూ, నా జాతిలోనూ అందరి జాతుల్లోనూ పెద్ద పెద్ద దొంగలు ఉంటారు’ వంటి సంభాషణలు మూవీపై ఆసక్తిని పెంచుతున్నాయి.

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి కానుకగా నవంబరు 2న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘‘న్యాయం కోసం ధైర్యంగా ,విశ్వాసంగా పోరాడే కథ ఇది.. మీ ముందుకు ఈ మూవీ తీసుకొస్తున్నందుకు గర్వంగా ఉంది. నవంబరు2న ఈ మూవీ అమెజాన్‌ ఓటీటీ వేదికగా విడుదల కానుంది’’ అని సూర్య ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. Jai Bhim movie

Related posts

Acharya Movie : మెగా అభిమానులకు పండగే..ఆచార్య ‘సిద్ధ’ టీజర్ వచ్చేసింది

Hardworkneverfail

SPIDER-MAN – NO WAY HOME : స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్.. తెలుగు మూవీ ట్రైలర్

Hardworkneverfail

Jai Bhim: చరిత్ర సృష్టించిన జైభీమ్..IMDB రేటింగ్‌లో ఎవరికీ అందనంత ఎత్తులో..

Hardworkneverfail

రాజ్ తరుణ్ ‘అనుభవించు రాజా’ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ ట్రైలర్!

Hardworkneverfail

Jai Bhim : ఆకట్టుకుంటున్న సూర్య ‘జై భీమ్’ ట్రైలర్..

Hardworkneverfail

Skylab Movie : ఆసక్తి రేపుతోన్న నిత్యామీన‌న్‌, స‌త్య‌దేవ్‌ ‘స్కైలాబ్’ ట్రైలర్

Hardworkneverfail