Bright Telangana
Image default

రాజ్ తరుణ్ ‘అనుభవించు రాజా’ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ ట్రైలర్!

Anubhavinchu Raja movie

రాజ్ తరుణ్ హీరోగా శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో ‘అనుభవించు రాజా’ మూవీ రూపొందింది. నాగార్జున ఈ మూవీ ట్రైలర్‌ని విడుదల చేసి విష్ చేశారు. మూవీలో రెండు కథలు ఉన్నాయి. మొదటిది ఒక గ్రామంలో, రెండవది సిటీలో జరుగుతుంది. విలేజ్ పార్ట్ కామెడీ రాజ్ తరుణ్‌కి బలం అని చెప్పొచ్చు. ఈ మూవీ టీజర్ రాజ్ తరుణ్‌ని జూదగాడుగా ప్రెజెంట్ చేయగా, నాగార్జున లాంచ్ చేసిన మూవీ తాజా ట్రైలర్‌లో ఈ క్యారెక్టర్‌లోని మరో కోణాన్ని చూపించారు.

రాజ్ తరుణ్ థియేటర్ వద్ద నాగార్జున భారీ కటౌట్ ముందు డ్యాన్స్ చేయడంతో ట్రైలర్‌ ప్రారంభమవుతుంది. రాజ్ తరుణ్ ఒక సాఫ్ట్‌వేర్ ఆఫీస్‌లో సెక్యూరిటీ గార్డుగా పరిచయం అయ్యాడు. సెక్యూరిటీ గార్డులను అసహ్యించుకునే కంపెనీ ఉద్యోగి కాశీష్ ఖాన్‌ను ఆరాధిస్తాడు. ఆ తరువాత మళ్ళీ తన పాత రోల్ లోకి చేంజ్ అయిన రాజ్ తరుణ్ ఒరిజినాలిటీ చూపించారు. బిగ్ బాస్ ఫేమ్ అరియానా ఓ చిన్న పాత్రలో కన్పించింది. రాజ్ తరుణ్ తన గ్రామానికి ప్రెసిడెంట్ అవుతానంటూ సవాలు చేయడంతో ట్రైలర్ పూర్తయ్యింది. ట్రైలర్ పూర్తిగా ఉల్లాసంగా ఉంది. శ్రీను గవిరెడ్డి ‘అనుభవించు రాజా’ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్విసి ఎల్ఎల్పి బ్యానర్లు సంయుక్తంగా ఈ మూవీనీ నిర్మిస్తున్నాయి. నవంబర్ 26న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts

SPIDER-MAN – NO WAY HOME : స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్.. తెలుగు మూవీ ట్రైలర్

Hardworkneverfail

Raja Vikramarka: ‘రాజా విక్రమార్క’ ట్రైలర్‌.. దీపావళి గ్రాండ్‌గా ప్లాన్‌ చేసిన కార్తికేయ!

Hardworkneverfail

Cobra Movie : గణిత శాస్త్రవేత్తగా విక్రమ్.. ఆకట్టుకుంటున్న ‘కోబ్రా’ మూవీ ట్రైలర్..

Hardworkneverfail

Ghani Teaser: ఆట ఆడిన ఓడిన రికార్డ్స్ లో ఉంటావు..కాని గెలిస్తేనే చరిత్రలో ఉంటావు

Hardworkneverfail

Anubhavinchu Raja Movie : ‘అనుభవించు రాజా’ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Hardworkneverfail

Bimbisara Teaser: కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ మూవీ టీజర్ విడుదల.. విజువల్ గ్రాండియర్..

Hardworkneverfail