Bright Telangana
Image default

Bimbisara Teaser: కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ మూవీ టీజర్ విడుదల.. విజువల్ గ్రాండియర్..

Bimbisara Teaser

నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘బింబిసార’. ఎ టైమ్‌ ట్రావెల్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ టు గుడ్‌.. అన్న క్యాప్షన్‌తో వశిష్ట్‌ దర్శకత్వంలో ఈ మూవీ వస్తుంది. ఆయన సొంత బ్యానర్లో నిర్మితమైన మూవీ ఇది. ఎలాంటి హడావిడి లేకుండా కళ్యాణ్ రామ్ ఈ మూవీ షూటింగును పూర్తిచేశాడు.

ఈ మూవీలో కేథరీన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. ఇందులోని విజువల్స్, వాయిస్ ఓవర్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా యాక్షన్ ఎలివేషన్ షాట్స్ అయితే అద్భుతం. ఓ సమూహం తాలూకు ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే.. కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తలవంచి బానిసలైతే.. పొగరుతో ఓ రాజ్యం మీసం మెలేసింది అంటూ వాయిస్ ఓవర్‌తో సాగిన టీజర్ ఆకట్టుకుంది.

రాజ మందిరంలోని చిన్న నీటి కొలనులో ఉన్న మొసలిపైనుంచి నడుచుకుంటూ బింబిసారుడు వెళ్లే సీన్ టీజర్ మొత్తానికి హైలైట్. బింబిసార టీజర్.. హై ఓల్టేజ్‌లో కళ్యాణ్ రామ్ లుక్స్ గతంలో ఏ మూవీలో లేనట్లుగా ఉన్నాయి. బింబిసార అనే క్రూరమైన రాజుగా శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు కళ్యాణ్ రామ్. ఈ షాట్స్ అన్నీ చూస్తుంటే మూవీ మరో స్థాయిలో ఉండబోతుందని అర్థమవుతుంది.

Related posts

Shiva Shankar Master : కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూత..

Hardworkneverfail

‘రిపబ్లిక్’ మూవీ ఫస్ట్ వీక్ టోటల్ కలెక్షన్స్ :పెట్టుబడిలో సగం కూడా రాలేదు

Hardworkneverfail

ఓటీటీలో శ్రీ విష్ణు ‘రాజ రాజ చోర’

Hardworkneverfail

MAA Election: మంచు విష్ణు ఘన విజయం

Hardworkneverfail

‘భీమ్లా నాయక్’ మెలోడీ: అందరూ ఇష్టంగా వినేలా ‘అంత ఇష్టం’ పాట..!

Hardworkneverfail

Cobra Movie : గణిత శాస్త్రవేత్తగా విక్రమ్.. ఆకట్టుకుంటున్న ‘కోబ్రా’ మూవీ ట్రైలర్..

Hardworkneverfail