Bright Telangana
Image default

Ghani Teaser: ఆట ఆడిన ఓడిన రికార్డ్స్ లో ఉంటావు..కాని గెలిస్తేనే చరిత్రలో ఉంటావు

Ghani Teaser

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ మొదటిసారి స్పోర్ట్స్ డ్రామాతో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటిస్తున్న మూవీ ‘గని’. కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని డిసెంబర్ 3న విడుదల చేయనున్నట్లు అధికారికంగా తెలిపారు. రీసెంట్ గా విడుదల చేసిన గని ఆల్బమ్ కు సూపర్బ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. గని ప్రపంచాన్ని పరిచయం చేసారు కూడా. ఈరోజు ఉదయం 11.08 గంటలకు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ వాయిస్‌ ఓవర్‌తో ఉన్న గని మూవీ టీజర్‌ను విడుదల చేసింది మూవీ యూనిట్.

ముఖ్యంగా రామ్‌చరణ్‌ వాయిస్ ఓవర్‌లో వచ్చిన మాటలు బాగున్నాయి. ప్రతి ఒక్కరి కథలో కష్ఠాలు ఉంటాయి.. కన్నీళ్లు ఉంటాయి.. కోరికలు ఉంటాయి.. కోపాలు ఉంటాయి.. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ ఛాంపియన్ అవ్వాలని ఉంటుంది. అయితే ఛాంపియన్ అయ్యేది ఒక్కడే.. ఆ ఒక్కడు నువ్వే ఎందుకు అవ్వాలి.. అంటూ సాగే వాయిస్ ఓవర్ నెటిజన్స్‌ను ఆకర్షిస్తోంది. ఇక చివరగా.. ఆటలో ఆడినా ఓడినా రికార్డ్స్‌లో ఉంటాం.. కానీ గెలిస్తే మాత్రమే చరిత్రలో ఉంటావు.. అంటూ డైలాగ్ వదిలారు.

బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, కన్నడ నటుడు ఉపేంద్ర, జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీని రెనైసన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్‌పై సిద్దు ముద్దా, అల్లు వెంకటేష్ నిర్మిస్తున్నారు. “గని” మూవీలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఎస్​ఎస్ తమన్​ తన సంగీతాన్ని అందించగా జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రాఫర్​గా పని​ చేస్తున్నాడు. గద్దలకొండ గణేష్, ఎఫ్ 2 తరువాత వరుణ్ తేజ్ ఒక మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టీజర్ చూస్తే అర్ధమవుతుంది.

Related posts

Raja Vikramarka: ‘రాజా విక్రమార్క’ ట్రైలర్‌.. దీపావళి గ్రాండ్‌గా ప్లాన్‌ చేసిన కార్తికేయ!

Hardworkneverfail

Bheemla Nayak : పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ నుంచి వచ్చేస్తున్న ఫోర్త్ సింగిల్!

Hardworkneverfail

Bheemla Nayak: అభిమానులకు సర్‌ప్రైజ్‌.. ‘లాలా భీమ్లా’ వీడియో ప్రోమో అదిరింది!

Hardworkneverfail

Akhanda Video Song : అదరగొడుతోన్న బాలకృష్ణ ‘అఖండ’ మూవీ జై బాలయ్య వీడియో సాంగ్

Hardworkneverfail

Bangarraju Teaser : నవ ‘మన్మథుడు’ వచ్చాడు.. ‘చిన్న బంగార్రాజు’ గా నాగ చైతన్య..

Hardworkneverfail

Bimbisara Teaser: కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ మూవీ టీజర్ విడుదల.. విజువల్ గ్రాండియర్..

Hardworkneverfail