Bright Telangana
Image default

Unstoppable With NBK : ఏఎన్నార్ ను ఇమిటేట్ చేసిన బాలయ్య!

Unstoppable With NBK

Unstoppable With NBK Episode 3 : బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ పేరుతో ఓటీటీ సంస్థ ‘ఆహా’ ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. మొదటి ఎపిసోడ్‏లో మంచు మోహన్ బాబు ఫ్యామిలీపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ సందడి చేశారు. ఇక నాని ఎపిసోడ్ సరదాగా .. ఆటలతో సాగింది. ఈ రెండు ఎపిసోడ్స్ కి ‘ఆహా’ ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక తాజాగా ఈ షోలో 3వ ఎపిసోడ్ కోసం కామెడీ కింగ్ బ్రహ్మానందం, డైరెక్టర్ అనిల్ రావిపూడిని ఆహ్వానించారు. ఇది ప్రస్తుతం ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ ఎపిసోడ్. సరదాగా సాగిన ఈ ఎపిసోడ్‌లో ఏఎన్నార్ ను బాలకృష్ణ ఇమిటేట్ చేసిన వీడియోను ‘ఆహా’ విడుదల చేయగా, ప్రస్తుతం అది ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. బ్రహ్మానందం కోరిక మేరకు బాలకృష్ణ.. అక్కినేని నాగేశ్వరరావు గారిని ఇమిటేట్ చేస్తూ ఒక సుదీర్ఘమైన డైలాగ్ చెప్పారు. బాలకృష్ణ చాలా స్పష్టంగా, పర్ఫెక్ట్ టోన్‌తో ఏఎన్నార్ డైలాగ్‌ని చెప్తుంటే, బ్రహ్మానందం మరియు అనిల్ రావిపూడి అలా చూస్తుండి పోయారు. ఇక ఈ ముగ్గురూ కలిసి పై ఏ రేంజ్ లో సందడి చేశారనేది పూర్తి ఎపిసోడ్ లో చూసేయవవచ్చు.

ఇక వచ్చే ఏడాది అనిల్ రావిపూడితోను బాలకృష్ణ ఒక మూవీ చేయనున్నారు. ఆల్రెడీ అనిల్ రావిపూడి ఈ విషయాన్ని ధృవీకరించారు కూడా. బాలకృష్ణ ప్రస్తుతం తన తాజా మూవీ ‘అఖండ’ బ్లాక్ బస్టర్ హిట్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు కొల్లగొడుతోంది. దేశవిదేశాల్లో ఉన్న ఆయన అభిమానులు జాతర జరుపుకుంటున్నారు.

unstoppable episode 3

Related posts

Unstoppable With NBK : ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’..

Hardworkneverfail

Unstoppable With NBK : ‘అన్ స్టాపబుల్ షో’లో విజయ్ దేవరకొండ ‘లైగర్’ టీమ్ సందడి

Hardworkneverfail

Akhanda, Shyam Singha Roy in Ott : ఓటీటీలోకి వచ్చేసిన ‘అఖండ’, ‘శ్యామ్ సింగ రాయ్’

Hardworkneverfail

MAA Elections 2021: మంచు విష్ణు ప్యానల్ కు మద్దతు తెలిపిన బాలకృష్ణ

Hardworkneverfail

‘ఆహా’లో సిద్దార్థ్ ఒరేయ్‌ బామ్మర్ది మూవీ ..

Hardworkneverfail

Akhanda Collections : బాలయ్య కెరీర్ లో ఫస్ట్ 100 కోట్ల గ్రాస్ మార్క్.. ‘అఖండ’ మూవీ 10 డేస్ కలెక్షన్స్

Hardworkneverfail