Bright Telangana
Image default

MAA Elections 2021: మంచు విష్ణు ప్యానల్ కు మద్దతు తెలిపిన బాలకృష్ణ

మా ఎన్నికల ప్రచారాలు హోరాహోరీగా సాగుతున్నాయి.. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటం అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్- మంచు విష్ణు .. ఇద్దరు తమ ప్రచారాల వేగం పెంచారు. ఇప్పటికే మైకుల ముందుకు వచ్చి.. ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూ హీటు పెంచుతున్నారు. మా ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ వచ్చిన వారిలో కొందరు వెనక్కి తగ్గడంతో చివరకు అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు -ప్రకాష్ రాజ్ మాత్రమే మిగిలారు. తాజాగా నందమూరి బాలకృష్ణ తన మద్దతును విష్ణు ప్యానల్ కు ఇస్తున్నట్లు తెలిపారు.

ఈ విషయాన్ని విష్ణునే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెళ్లడించారు. “మా ఎన్నికల్లో నన్ను సపోర్ట్ చేస్తూ.. బ్లెస్ చేసినందుకు థ్యాంక్యూ.. బాలన్న” అంటూ విష్ణు తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. అంతేకాదు బాలయ్యతో దిగిన రెండు ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు.

మెగా ఫ్యామిలీ ప్రకాష్ రాజ్ ప్యానల్ కు మద్దతు ఇస్తుండడం తో..నందమూరి బాలకృష్ణ ఖచ్చితంగా మంచు విష్ణు ప్యానల్ కే మద్దతు ఇస్తారని ముందు నుండి అంత మాట్లాడుకుంటూ వచ్చారు. వారు అనుకున్నట్లే ఇప్పుడు బాలయ్య తన మద్దతు విష్ణు ఇచ్చారు. ప్రస్తుతం ఇరు ప్యానల్ సభ్యులు ఎవరికీ వారు తమ గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఫైనల్ గా ఎవరు గెలుస్తారనేది చూడాలి.

Related posts

Akhanda Collections :‘అఖండ’ మూవీ 11 డేస్ కలెక్షన్స్.. బాలయ్య మాస్ పవర్!

Hardworkneverfail

MAA Election: మంచు విష్ణు ఘన విజయం

Hardworkneverfail

Pawan Kalyan-Manchu Vishnu: పవన్‌ కళ్యాణ్ vs మంచు విష్ణు.. ఎడమొఖం.. పెడమొఖం.. ఎం జరిగింది..?

Hardworkneverfail

బాలకృష్ణతో ఈనాటి అనుబంధం ఏనాటిదో.. అఖండ వేడుకలో అల్లు అర్జున్..

Hardworkneverfail

Unstoppable With NBK : ఏఎన్నార్ ను ఇమిటేట్ చేసిన బాలయ్య!

Hardworkneverfail

Unstoppable Promo: ‘వన్స్ ఐ స్టెప్ ఇన్.. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా..’ అన్ స్టాపబుల్ విత్ NBK

Hardworkneverfail