Mahesh Babu Emotional Tweet : సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేష్ బాబు, మహేష్ బాబు అన్నయ్య శనివారం రాత్రి మృతి చెందారు. కొద్ది రోజులుగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. ఈరోజు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో రమేష్ బాబు అంత్యక్రియలు జరిగాయి. కోవిడ్ -19 కారణంగా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నందున అతని సోదరుడు మహేష్ బాబు అంత్యక్రియలకు హాజరు కాలేదు.
అయితే, మహేష్ బాబు తన అన్నయ్య గురించి ఎమోషనల్ ట్వీట్ చేసాడు, నువ్వే నా సర్వస్వం, బలం, ధైర్యం. నువ్వు లేకుంటే ఈ రోజు ఉన్న మనిషిలో సగం ఉండే వాడిని కాదు. మీరు నా కోసం చేసిన ప్రతిదానికీ ధన్యవాదాలు. ఇప్పుడు విశ్రాంతి..విశ్రాంతి.. నాకు మరో జీవితమంటూ ఉంటే నువ్వే నా అన్నయ్యగా ఉంటావు. నేను నిన్ను ఎప్పటికీ, ఎప్పటికీ, ఎప్పటికీ ప్రేమిస్తున్నాను’ అని ట్వీట్ చేశాడు.
— Mahesh Babu (@urstrulyMahesh) January 9, 2022