Bright Telangana
Image default

Penny Song From Sarkaru Vaari Paata: ‘పెన్నీ’ లిరికల్ సాంగ్ రిలీజ్.. మహేష్, సితార స్టెప్పులు అదుర్స్ !

penny song released from sarkaru vaari paata movie

Penny Song From Sarkaru Vaari Paata Movie : సూపర్ స్టార్ మహేష్ బాబు ఫస్ట్ సింగిల్ ‘కళావతి’ సాంగ్ లో చాలా యవ్వనంగా కనిపించాడు. కీర్తి సురేష్ కూడా ఈ ఫస్ట్ సాంగ్ లో అంతే అందంగా కన్పించింది. యూట్యూబ్ లో రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ కళావతి ఫస్ట్ సాంగ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇక ‘సర్కారు వారి పాట’ మూవీ నుండి సెకండ్ సింగల్ పెన్నీ సాంగ్ ను (Penny Song) విడుదల చేసారు మూవీ మేకర్స్.

మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని తొలిసారిగా మ్యూజిక్ వీడియోలో కనిపించింది. సితార సాంగ్ లో ఎవరూ ఊహించని విధంగా మెరవడం మరియు సితార అద్భుతమైన స్టెప్పులు మహేష్ అభిమానులను ఫిదా చేస్తున్నాయి. సితార డ్యాన్స్‌ చూస్తుంటే రెండు కళ్లు చాలడం లేదని మహేష్‌ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అటు మహేష్‌ కూడా ఈ పాటలో క్యూట్‌గా కనిపిస్తున్నాడు. మహేష్‌ డ్యాన్స్ కూడా అభిమానులను అలరిస్తోంది. పెన్నీ సాంగ్‌లో మహేష్ కళ్లజోడు పెట్టుకుని మెరిసిపోతున్నాడు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సాంగ్ ను ఆదివారం విడుదల మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీలో మహేశ్‌బాబు, కీర్తి సురేష్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సాంగ్ ను నకాష్ అజీజ్ ఆలపించగా, అనంత శ్రీరామ్ లిరిక్స్ రాశారు.

ఎస్ థమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, 14 రీల్స్ ప్లస్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట మరియు గోపి ఆచంట నిర్మించగా, యంగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించారు ఈ మూవీకి. కాగా ‘సర్కారు వారి పాట’ మూవీ మే 12న విడుదల కానుంది.

Related posts

Major : అడివి శేష్ ‘మేజర్’ మేకింగ్ వీడియో విడుదల.. రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసిన మహేష్

Hardworkneverfail

Penny Song Promo From Sarkaru Vaari Paata

Hardworkneverfail

Mahesh Babu Emotional Tweet : రమేష్ బాబుపై మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్

Hardworkneverfail

Evaru Meelo Koteeswarulu : సరదాగా సాగిన మహేష్, ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’

Hardworkneverfail

Murari Vaa Video Song : ‘సర్కారువారి పాట’ మూవీ నుంచి ‘మురారివా’ సాంగ్ రిలీజ్!

Hardworkneverfail

Tollywood Hero’s: స్పందించిన టాలీవుడ్.. చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ భారీగా విరాళాలు..

Hardworkneverfail