Murari Vaa Video Song : సూపర్ స్టార్ మహేష్ బాబు – కీర్తి సురేశ్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో ‘ సర్కారు వారి పాట’ మూవీ రూపొందింది. మే నెల 12 వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమన్ సంగీతం ఈ మూవీ విజయంలో కీలకమైన పాత్రను పోషించాయి. ముఖ్యంగా ‘కళావతి’ .. ‘మ మ మహేశా’ సాంగ్స్ ఒక రేంజ్ లో దూసుకుపోయాయి.
అయితే, ఈ మూవీ కోసం చిత్రీకరించిన ‘మురారివా’ అనే సాంగ్ ను కొన్ని కారణాల వలన ఉపయోగించలేదు. మూవీ విడుదల తరువాత కొన్ని రోజులకు ఈ సాంగ్ ను యాడ్ చేశారు. తాజాగా ఆ సాంగ్ ను యూ ట్యూబ్ లో విడుదల చేసారు మూవీ మేకర్స్. ‘మురారివా .. మురారివా .. మురళీ వాయిస్తూ ముడేస్తివా’ అంటూ ఈ సాంగ్ సాగుతోంది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు – కీర్తి సురేశ్ పై బ్యూటిఫుల్ సెట్లో ఈ సాంగ్ ను కలర్ఫుల్ గా చిత్రీకరించారు. సాహిత్యం పరంగా .. ట్యూన్ పరంగా ఓకే. కాకపోతే డైరెక్టర్ పరశురామ్ ఈ సాంగ్ (Murari Vaa Video Song) ను ఆపేసి.. ఆ ప్లేస్ లో మాస్ బీట్ గా ‘మ మ మహేశా’ వదలడమే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత స్లో సాంగ్ .. అక్కడ ఆ ఫ్లోలో పడితే ఇబ్బందిగానే ఉండేదేమో!