Bright Telangana
Image default

Ramesh Babu Passed Away : మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కన్నుమూత..

Super Star Mahesh Babu's Brother Ramesh Babu Passes Away

Ramesh Babu Passed Away : సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకొంది. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు, మహేష్ బాబు సోదరుడు అయిన రమేష్ బాబు శనివారం సాయంత్రం 9 గంటల సమయంలో మృతి చెందారు. రమేష్ బాబు గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్యపరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఏఐజీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే తుది శ్వాస విడిచారు.

రమేష్ బాబు మనుషులు చేసిన దొంగలు మూవీతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చారు. సామ్రాట్‌ మూవీతో హీరోగా.. ఆ తర్వాత నిర్మాతగా మారారు. తెలుగుతో పాటు హిందీ మూవీస్ ను కూడా నిర్మించారు రమేష్ బాబు. సూర్యవంశం (హిందీ), అర్జున్‌, అతిథి, దూకుడు మూవీస్ కు ఆయన ప్రొడ్యూసర్‌గా వ్యవరించారు. రమేష్ బాబు మృతితో ఘట్టమనేని ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది . అయితే మరోపక్క మహేష్ బాబు కరోనాతో బాధ పడుతూ ఉండగా.. ఆయన రమేష్ బాబును చూడడానికి వస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

Related posts

Evaru Meelo Koteeswarulu : సరదాగా సాగిన మహేష్, ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోమో

Hardworkneverfail

Evaru Meelo Koteeswarulu : మహేష్ తో సరదాగా సాగిన ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’

Hardworkneverfail

Penny Song Promo From Sarkaru Vaari Paata

Hardworkneverfail

Major : అడివి శేష్ ‘మేజర్’ మేకింగ్ వీడియో విడుదల.. రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసిన మహేష్

Hardworkneverfail

Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు

Hardworkneverfail

The Ghost Trailer : నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ ట్రైలర్ ను రిలీజ్ చేసిన మహేశ్ బాబు..

Hardworkneverfail