జూనియర్ ఎన్టీఆర్ ఓ వైపు మూవీల్లో బిజీగా ఉంటూనే జెమినీ టీవీలో వచ్చే ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో ఆయన తనదైన మాటలతో ప్రేక్షకులను అలరిస్తూ ఈ షోకు టీఆర్ఫీలను తెచ్చిపెడుతున్నారు. ఇక అది అలా ఉంటే.. ఎన్టీఆర్ షోకి మరింత గ్లామర్ తీసుకొచ్చేందుకు.. టీఆర్పీ రికార్డ్స్ బద్దలుకొట్టాడనికి ఎన్టీఆర్ షోకు సూపర్ స్టార్ మహేష్ బాబు వస్తున్నారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ పూర్తైయింది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.. అలాగే ఎపిసోడ్ త్వరలో రాబోతోందంటూ జెమిని ఛానెల్ వాళ్లు కూడా ప్రకటించారు.
తాజాగా రిలీజైన ప్రోమోని చూస్తే.. మహేష్ ని ‘అన్నా’ అని స్టేజ్ పైకి పిలిచారు ఎన్టీఆర్. ఆ తరువాత ‘నా రాజా’ అంటూ షో మొదలుపెట్టారు. ‘అదిరిపోయింది సెటప్ అంతా’ అని మహేష్ కామెంట్ చేశారు. ఆ తరువాత ‘కరెక్ట్ ఆన్సర్ ని అటు తిప్పి ఇటు తిప్పి ఎందుకు..?’ అని ప్రశ్నించారు మహేష్. ‘సరదాగా’ అంటూ బదులిచ్చాడు ఎన్టీఆర్. ఆ వెంటనే ‘గురువుగారే బెటర్‌గా ఉన్నారు నీకన్నా’ అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ తో అందరూ నవ్వేశారు. మరి ఆలస్యం ఎందుకు అంతవరకు ఈ ప్రోమో చూసి ఎంజాయ్ చేయండి.