Mahesh Babu Launches The Ghost Movie Trailer : అక్కినేని నాగార్జున యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ఘోస్ట్’ థియేట్రికల్ ట్రైలర్ ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నేడు సోషల్ మీడియాలో ఆవిష్కరించారు. ఎంతో తీవ్రతతో కూడిన ‘ది ఘోస్ట్’ ట్రైలర్ ను విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉంది అంటూ మహేశ్ బాబు స్పందించారు. నాగార్జునతో పాటు యావత్ మూవీ యూనిట్ కి నా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ఈ మేరకు ‘ది ఘోస్ట్’ ట్రైలర్ వీడియోను కూడా పంచుకున్నారు. ఈ మూవీ అక్టోబర్ 5, 2022 న థియేటర్లలోకి రానుంది.
సునీల్ నారంగ్, నారాయణ్ దాస్ నారంగ్ మరియు శరత్ మరార్ ఈ మూవీని నిర్మించారు, నాగార్జున విక్రమ్ పాత్రను పోషించనున్నారు. ఈ మూవీలో ప్రధాన తారాగణంలో గుల్ పనాగ్ మరియు అనిఖా సురేంద్రన్‌లు ప్రధాన పాత్రలు పోషించారు. బ్రహ్మ కడలి ఈ మూవీకి ఆర్ట్ డైరెక్టర్, ముఖేష్ జి కెమెరావర్క్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.