నామినేషన్ల ప్రక్రియ గతంలో మాదిరిగా కాకుండా డిఫరెంట్‌గా ప్లాన్ చేశాడు బిగ్‌బాస్. కెప్టెన్ అనీ మాస్టర్ నలుగురిని నామినేట్ చేసి జైలుకి పంపించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా అనీ మాస్టర్.. మానస్, సన్నీ, కాజల్, షణ్ముఖ్‌లను జైలుకి పంపించి నామినేట్ చేస్తుంది. నామినేషన్ల నుంచి తప్పించుకునే అవకాశం కూడా ఇచ్చాడు బిగ్‌బాస్. బజర్ మోగిన వెంటనే లివింగ్ రూమ్‌లో ఉన్న తాళాలను ఎవరైతే దక్కించుకుంటారో వాళ్లు.. తమకు ఇష్టమైన కంటెస్టెంట్‌ని జైలు నుంచి బయటకు తీసుకురావొచ్చని మిగిలిన ఇంటి సభ్యులకు సూచించాడు.
ఇందులో భాగంగా ప్రియాంక తాళం దక్కించుకొని మానస్‌ని బయటకు తీసుకొచ్చింది. బయటకు వచ్చిన మానస్.. జెస్సీ, రవిలను నామినేట్ చేశాడు. సిరి తాళం దక్కించుకొని షణ్ముఖ్‌ను కాదని జెస్సీని బయటకు తీసుకొచ్చింది. జెస్సీ వల్ల షణ్ముఖ్ బయటపడ్డాడు. తనకు ఒకరిని నామినేట్ చేసే చాన్స్ రావడంతో.. ప్రియాంకని ఎంచుకున్నాడు. కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఆమె వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, కాబట్టి ఆమెను ఈ వారం ఎలిమినేషన్‌కి నామినేట్ చేస్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత రవి తాళం దక్కించుకుని ప్రియాంకని సేవ్ చేశాడు. షణ్ముఖ్‌ని పంపించారు. శ్రీరామ్ తాళం దక్కించుకుని కాజల్‌ని సేవ్ చేశాడు. సిరిని లోపలికి పంపించారు.
చివరగా కాజల్ తాళం దక్కించుకుని షణ్ముఖ్‌ని సేవ్ చేశారు. రవిని జైల్లోకి పంపించారు. ఇక చివరికి జైలులో మిగిలిన మానస్, సిరి , సన్నీ, రవిలు నామినేట్ కాగా.. బిగ్‌బాస్ మరోసారి యానీ మాస్టర్ కు లక్కీ ఛాన్స్ ఇచ్చాడు. ఇంటి సభ్యులలో ఒకరిని నేరుగా నామినేట్ చేయాలని ఆదేశించాడు. దీంతో ఆమె మరో ఆలోచన లేకుండా కాజల్‌ను నామినేట్ చేసింది. మొత్తంగా.. పదవ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు సిరి, మానస్, సన్నీ, రవి, కాజల్ నామినేట్ అయ్యారు.