CM KCR Gives Clarity About Lockdown : తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, ఇతర ఆరోగ్యశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించి వైరస్ వ్యాప్తి చెందకుండా మార్గదర్శకాలను సూచించారు. ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం జనవరి రెండో వారంలో రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించబోతున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఓమిక్రాన్ వేరియంట్‌తో(Omicron Variant) ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని మరియు వైరస్‌పై పోరాడటానికి అవసరమైన నివారణ చర్యలు తీసుకోవాలని అలాగే ఆసుపత్రుల్లో అవసరమైన బెడ్స్, ఆక్సిజన్ అందేలా చూడాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.