Jawad Cyclone : ఏపీలో మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రను టెన్షన్ పెట్టిన జొవాద్ తుపాను క్రమంగా బలహీనపడుతోంది. ఈరోజు అర్థరాత్రికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ‘జవాద్’ తుపాను మరింత బలహీనపడుతూ బెంగాల్ వైపు పయనించి అక్కడే తీరం దాటే అవకాశం ఉంది.
అయితే ‘జవాద్’ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముందే అప్రమత్తమైన అధికారులు 55 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోందని, విశాఖపట్నంకు తూర్పు ఆగ్నేయంగా 180 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్ పూర్ కు 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వివరించింది.