Bright Telangana
Image default

బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం.. భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం

low pressures

ఆంధ్రప్రదేశ్ : ఆగ్నేయ బంగాళాఖాతం మరియు ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రంలో బలపడిన అల్పపీడనం.. రాగల 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి వాయుగుండంగా మారనుంది అని ప్రకటించింది. ఆ తదుపరి 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. కాగా, ఇది తుపానుగా మారితే ‘జవాద్’ అని పిలవనున్నారు.

శనివారం ఉదయం నాటికి ఉత్తరాంధ్ర – ఒడిశా తీరాలకు చేరుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో శుక్రవారం ఉత్తరాంధ్రలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. శనివారం ఉత్తరాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అయితే రేపు అర్ధరాత్రి నుంచి తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ, ఎల్లుండి ఉదయం నుంచి 70-90 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయి. అందువల్ల మత్య్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్ళరాదు అని ఆదేశాలు ఇచ్చింది. భారీ వర్షాల నేపధ్యంలో లోతట్టు ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు పేర్కొన్నారు.

Related posts

AP CM Jagan: చంద్రబాబు కన్నీటిపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్..

Hardworkneverfail

AP Minister Mekapati Goutham Reddy Passes Away : ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కన్నుమూత..

Hardworkneverfail

Tirupati Rains: భారీ వర్షాలతో బీభత్సం.. తిరుపతిలో వరద నీటిలో కొట్టుకుపోయిన వాహనాలు

Hardworkneverfail

Andhra Pradesh : అదుపుతప్పి వాగులో పడిపోయిన ఆర్టీసీ బస్సు.. పది మంది మృతి

Hardworkneverfail

Jawad Cyclone Updates : దిశ మార్చుకున్న జవాద్.. ఏపీకి తప్పిన ముప్పు..!

Hardworkneverfail

Kandukuru Incident : చంద్రబాబు సభలో అపశృతి.. తోపులాటలో 8 మంది మృతి

Hardworkneverfail