Bright Telangana
Image default

Kandukuru Incident : చంద్రబాబు సభలో అపశృతి.. తోపులాటలో 8 మంది మృతి

Kandukuru Incident

Kandukuru Incident : చంద్రబాబు సభలో అపశృతి చోటుచేసుకుంది. ఈ సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలిరావడంతో తోపులాట జరిగి 8 మంది మృతి చెందారు. ఇక వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా కందుకూరులో ఏర్పాటు చేసిన చంద్రబాబు సభకు ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో కార్యకర్తల మధ్య స్వల్ప తోపులాట జరిగింది.

ఈ తోపులాటలో సుమారు పది మంది కార్యకర్తలు ఒక్కసారిగా పెద్ద కాలువలో పడిపోయారు. ఈ క్రమంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారని చెబుతున్నారు. మరో 6గురు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయారని తెలుస్తోంది. ఈ ఘటనలో కాలువలో పడి గాయపడిన కార్యకర్తలను చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో చంద్రబాబు సభను అర్ధాంతరంగా నిలివేశారు. కాగా, ఈ ఘటనలో గాయపడిన వారిని చంద్రబాబు కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి.. క్షతగాత్రులను పరామర్శించినట్టు తెలుస్తోంది.

Related posts

Kadapa Floods: ‘డ్యాం తెగిపోవచ్చని సడన్‌గా చెప్పారు.. అంతలోనే భారీ వరద మా ఇళ్లపై వచ్చిపడింది’

Hardworkneverfail

Chandrababu: మీడియా ముందు వెక్కి వెక్కి ఏడ్చిన చంద్రబాబు..

Hardworkneverfail

Jr NTR: అసెంబ్లీ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం..

Hardworkneverfail

Nellore Sabha : చంద్రబాబు సభలో అపశృతి.. మృతులకు 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా

Hardworkneverfail

Nara Lokesh : విద్యుత్ చార్జీల పెంపు మరియు వైఎస్ జగన్ పై నారా లోకేష్ షాకింగ్ కామెంట్స్

Hardworkneverfail

Heavy Rains: మరో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్షసూచన

Hardworkneverfail