Bright Telangana
Image default

Chandrababu: మీడియా ముందు వెక్కి వెక్కి ఏడ్చిన చంద్రబాబు..

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ : శాసనసభలో జరిగిన పరిణామాలపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర బావోద్వేగానికి గురయ్యారు. మళ్లీ సీఎం అయ్యేవరకూ ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టబోనంటూ శపథం చేసిన చంద్రబాబు ఆ తర్వాత విలేకరుల సమావేశంలో గుండెలవిసేలా విలపించారు. రెండు నిమిషాలపాటు మాట్లాడలేకపోయారు. ఏనాడూ ఇంటినుంచి బయటకు రాని భువనేశ్వరిని లక్ష్యంగా చేసుకుని వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదన్నారు. భువనేశ్వరి చేసిన త్యాగం గొప్పదన్నారు. ప్రతి సంక్షోభంలోనూ ఆమె తనకు అండగా నిలిచారని చెప్పారు. వ్యక్తిగత దూషణలు చేస్తున్న వారి ఇళ్లల్లోని వారిని కూడా ఇలాగే తిడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు.

కానీ గత రెండున్నరేళ్లుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్ని విధాలా అవమానాలు ఎదుర్కొంటున్నాను. ఈ ప్రభుత్వం మా పార్టీ నాయకులు, కార్యకర్తలను వ్యక్తిగతంగా వేధిస్తోంది. కేసుల పేరుతో బెదిరిస్తోంది. బూతులు తిడుతూ దాడులకు పాల్పడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అవమానిస్తోందని, టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలను అవమానించడం పరిపాటిగా మారిందన్నారు. వైసీపీ నేతలు భువనేశ్వరి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని చంద్రబాబు చెప్పారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఎవరినీ వ్యక్తిగతంగా అవమానించలేదన్నారు. రాజకీయాల్లో విలువలు ఇంత నీచంగా పడిపోయాయనుకోలేదంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.

Related posts

Minister Kodali Nani : చంద్రబాబు ఇంట్లో వ్యభిచారం జరుగుతోంది.. మంత్రి కొడాలి నాని

Hardworkneverfail

Pawan Kalyan : ఓటమి భయంతోనే.. మూడు రాజధానుల నిర్ణయం వెనక్కి : పవన్ కళ్యాణ్

Hardworkneverfail

Heavy Rains: మరో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్షసూచన

Hardworkneverfail

బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం.. భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం

Hardworkneverfail

Nandamuri Balakrishna: వైసీపీ నేతలకు బాలకృష్ణ వార్నింగ్..

Hardworkneverfail

Kadapa Floods: ‘డ్యాం తెగిపోవచ్చని సడన్‌గా చెప్పారు.. అంతలోనే భారీ వరద మా ఇళ్లపై వచ్చిపడింది’

Hardworkneverfail