Bright Telangana
Image default

Pawan Kalyan : ఓటమి భయంతోనే.. మూడు రాజధానుల నిర్ణయం వెనక్కి : పవన్ కళ్యాణ్

ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఫైర్

ఆంధ్రప్రదేశ్ : సీఎం జగన్ తాజాగా మూడు రాజధానుల బిల్లు రద్దు అని ప్రకటించారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. సీఎం జగన్ కోర్టు నుంచి తప్పించుకోడానికి హడావిడి నిర్ణయని అన్నారు. అంతేకాదు.. హైకోర్టు నుంచి తప్పించుకోడానికి రాజధాని చట్టాలపై హడావిడి నిర్ణయమని… మరింత స్పష్టతతో కొత్త బిల్లును సభలో ప్రవేశపెడతామని చెప్పి ఏపీ ప్రజలను మరింత గందరగోళంలోకి నెట్టేశారని ఆగ్రహించారు పవన్ కళ్యాణ్. హైకోర్టులో ఓటమి తప్పదని భావించే తాత్కాలికంగా కోర్టు నుంచి తప్పించుకోడానికి బిల్లులను రద్దుకు ప్రభుత్వం ఉపక్రమించిందని నిప్పులు చెరిగారు.

కోర్టు తీర్పుతో ఈ గందరగోళానికి తెరపడుతుందని భావిస్తున్న తరుణంలో ప్రభుత్వం మరో కొత్త నాటకానికి తెర తీసిందని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఏడున్నర ఏళ్ళు అవుతున్నా రాజధాని ఎక్కడుంటుందో తెలియని స్థితి అని తెలిపారు. . అందుకనే తాత్కాలికంగా కోర్టు నుంచి తప్పించుకోడానికి జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనని రద్దు చేసినట్లు ప్రజలు భావిస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు.

మూడు రాజధానుల ఏర్పాటుతోనే అభివృద్ది వికేంద్రీకరణ జరుగుతుందనే భ్రమలోనే వైసిపి పెద్దలు మునిగి తేలుతున్నారని.. 30 వేల ఎకరాలలో కన్నా తక్కువలో రాజధాని ఏర్పాటు చేయరాదని నాడు అసెంబ్లీలో చెప్పిన మాటలు అధికారంలోకి రాగానే సీఎం జగన్ మరిచారని ఫైర్‌ అయ్యారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులపై 3వేలకు పైగా కేసులు పెట్టారని వెల్లడించారు మహిళలపై కూడా కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారని మండిపడ్గారు.

Related posts

AP New Districts : ఏపీలో వేగంగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ

Hardworkneverfail

Pawan Kalyan : ఏపీలో ఉచితంగా సినిమాలు వేసి చూపిస్తా..

Hardworkneverfail

Frist Day First Show Trailer: పవన్ కళ్యాణ్ మూవీ చూడకపోతే చచ్చిపోతా..

Hardworkneverfail

ఇలాగే ఉంటే ఇడుపులపాయలో హైవే వేస్తాం: పవన్ కళ్యాణ్

Hardworkneverfail

Bheemla Nayak Release Trailer : భీమ్లా నాయక్ కొత్త ట్రైలర్ రిలీజ్.. ఫ్యాన్స్‏కు ఇక పూనకాలే..

Hardworkneverfail

Badvel By Election: బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ భారీ విజయం

Hardworkneverfail