Bright Telangana
Image default

Pawan Kalyan : ఏపీలో ఉచితంగా సినిమాలు వేసి చూపిస్తా..

Pawan Kalyan : ఏపీలో ఉచితంగా సినిమాలు వేసి చూపిస్తా

అమరావతి (ఆంధ్రప్రదేశ్) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఏపీ సీఎం జగన్ పై, ఆయన పరిపాలనా విధానంపై మళ్ళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మూవీ టికెట్స్ ధరపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై మరోసారి నిరసన వ్యక్తం చేశారు. ఏపీలో తన మూవీనే టార్గెట్ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయాలను తీసుకుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వకీల్ సాబ్ సహా కొన్ని మూవీస్ థియేట్రికల్ రన్ పై పరిమితులు విధించిందని ఆరోపించారు. అప్పటి నుంచి తెలుగు సినీ పరిశ్రమపై టికెట్ ధరపై, రోజుకు షోల సంఖ్యపై ప్రభుత్వం పరిమితులు విధించింది.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒకరోజు దీక్ష అనంతరం మంగళగిరిలో జరిగిన భారీ సభను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో తనదైన రీతిలో స్పందించారు. మూవీస్ పై మరిన్ని పరిమితులు విధించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనను అణిచివేయవచ్చని అభిప్రాయపడ్డారు.

‘నా మూవీస్ ను పరిమితం చేయడం వల్ల నా ఆర్థిక అవకాశాలకు హాని కలుగుతుందని వారు నమ్ముతున్నారు. కానీ వారి రాజకీయ వ్యూహాలకు నేను లొంగను. అవసరమైతే ఆంధ్రప్రదేశ్‌లో నా మూవీస్ ను ఉచితంగా ప్రదర్శిస్తాను.’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Related posts

పవన్ కళ్యాణ్-పేర్ని నాని మధ్య ట్వీట్ల యుద్ధం

Hardworkneverfail

Bheemla Nayak 1st Day Total Collections : ‘భీమ్లా నాయక్’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్..

Hardworkneverfail

ఇలాగే ఉంటే ఇడుపులపాయలో హైవే వేస్తాం: పవన్ కళ్యాణ్

Hardworkneverfail

“జనసేనాని ఎఫెక్ట్” రాత్రికి రాత్రి తారు రోడ్డు, ఆశ్చర్యంలో స్థానికులు

Hardworkneverfail

Pawan Kalyan : ఓటమి భయంతోనే.. మూడు రాజధానుల నిర్ణయం వెనక్కి : పవన్ కళ్యాణ్

Hardworkneverfail

Pawan Kalyan : ఇంగిత జ్ఞానం ఉందా ? ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఫైర్

Hardworkneverfail