Bright Telangana
Image default

Nellore Sabha : చంద్రబాబు సభలో అపశృతి.. మృతులకు 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా

Chandrababu Announced 10 Lakh Ex Gratia

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కందుకూరులో తన ‘ఇదేం కర్మ రాష్ట్రానికి’ అనే కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో అపశృతి నెలకొంది. పామూరు రోడ్‌లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఆయన ప్రసంగిస్తున్న సమయంలో.. సభలో గందరగోళం, తొక్కిసలాట చోటు చేసుకున్నాయి. భారీగా జనం తరలిరావడం వల్లే ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో 8 మంది కాలువలో పడి మృతి చెందగా.. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే కందుకూరి ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే చంద్రబాబు తన సభను మధ్యలోనే ఆపేసి, ఆసుపత్రికి వెళ్లారు. బాధితుల్ని పరామర్శించారు. మృతి చెందిన వారిని దేవినేని రవింద్ర (ఆత్మకూరు), కలవకురి యనాది (కొండమూడుసుపాలెం), యటగిరి విజయ (ఉలవపాడు), కకుమాను రాజా (కందుకూరు), మరలపాటి చిన కొండయ్య (గుళ్లపాలెం), పురుషోత్తం (కందుకూరు)గా గుర్తించారు.

ఈ ఘటనపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొందరు నిండు ప్రాణాలు త్యాగం చేశారని చెబుతూ, తన సభను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఇది అత్యంత బాధాకరమైన ఘటన అని, కొన్ని సందర్భాల్లో మనం నిమిత్తమాత్రులం అవుతామని, విధిరాత ఇలా ఉందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్టు చంద్రబాబు తెలిపారు. వారికి పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దుర్ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు.

కందుకూరుకి ఎప్పుడు వచ్చినా.. ఆసుపత్రి సెంటర్‌లోనే సభ పెడుతుంటామని, కానీ ఈసారి దురదృష్టకర ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సభను కొనసాగించడం భావ్యం కాదన్నారు. దీన్ని సంతాప సభగా భావించి, మృతుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించి, సభను అర్థాంతరంగా ముగించారు.

Related posts

Nandamuri Balakrishna: వైసీపీ నేతలకు బాలకృష్ణ వార్నింగ్..

Hardworkneverfail

Minister Kodali Nani : చంద్రబాబు ఇంట్లో వ్యభిచారం జరుగుతోంది.. మంత్రి కొడాలి నాని

Hardworkneverfail

చంద్రబాబు కంచుకోట బద్దలు.. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ పార్టీ హవా..

Hardworkneverfail

Chandrababu: మీడియా ముందు వెక్కి వెక్కి ఏడ్చిన చంద్రబాబు..

Hardworkneverfail

Jr NTR: అసెంబ్లీ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం..

Hardworkneverfail

Kandukuru Incident : చంద్రబాబు సభలో అపశృతి.. తోపులాటలో 8 మంది మృతి

Hardworkneverfail