Bright Telangana
Image default

Jr NTR: అసెంబ్లీ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం..

Jr NTR reaction on Chandrababu Tears

ఆంధ్రప్రదేశ్ : జూనియర్ ఎన్టీఆర్ ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై స్పందించారు. తన మనోభావాన్ని వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా ఆయన ట్విటర్లో వీడియో రిలీజ్ చేశారు. నిన్న అసెంబ్లీలో జరిగిన ఘటన కలచివేసిందన్నారు. రాజకీయాల్లో విమర్శలు చేసుకోవడం సర్వసాధారణమని, విమర్శలు ప్రజాసమస్యలపైనే జరగాలన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు.

ప్రజా సమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని ఎన్టీఆర్ అన్నారు. ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పరుషపదజాలంతో మాట్లాడడం అరాచక పరిపాలనకు నాంది పలుకుతుందన్నారు. ఆడవాళ్లను గౌరవించడం మన సంస్కృతి అని చెప్పారు. ఇది మన రక్తంలో ఇమిడిపోయిన సంప్రదాయం అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. తాను ఒక కుటుంబసభ్యుడిగా మాట్లాడటం లేదని, ఒక కొడుకుగా, తండ్రిగా, భర్తగా, దేశ పౌరుడిగా ముఖ్యంగా తెలుగువాడిలా మాట్లాడుతున్నానని తెలిపారు. మ‌న సంస్కృతిని కాల్చివేసేలా వ్యవహ‌రించ‌కూడ‌దన్నారు. ఈ అరాచ‌క సంస్కృతిని ఇంత‌టితో ఆపాలని పిలుపునిస్తూ రాజకీయ నాయకులకు ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు.

Related posts

RRR Day 9 Collections : 9 వ రోజు ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్.. ఊరమాస్ అనిపించేలా కలెక్షన్స్

Hardworkneverfail

Crypto Currency Suicide: నెలకు లక్షన్నర జీతం వదిలేసి, క్రిప్టోలో పెట్టుబడులు పెట్టారు, చివరికి..?

Hardworkneverfail

RRR Movie: టిక్కెట్‌ ధరల తగ్గింపుపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ నిర్మాత అసంతృప్తి

Hardworkneverfail

Pawan Kalyan : ఇంగిత జ్ఞానం ఉందా ? ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఫైర్

Hardworkneverfail

తాజా ఫలితాలతో నైనా చంద్రబాబు మారాలి : ఏపీ సీఎం జగన్

Hardworkneverfail

RRR Movie First Day Collections : ఆర్ ఆర్ ఆర్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ 200 కోట్లు ?

Hardworkneverfail