ఆంధ్రప్రదేశ్ : తిరుమల, తిరుపతిలలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. రెండో కనుమ దారిలో హరిణి దగ్గర ఈ ఘటన జరిగింది. అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో, విపత్తుల నిర్వహణ శాఖ కార్యాలయంలో వరద నీరు చేరింది. తిరుపతిలో ప్రసూతి ఆస్పత్రిలోకి కూడా నీళ్లు చేరాయి. వరద ప్రవాహంలో వాహనాలు కొట్టుకుపోయాయి.
భారీ వర్షం కారణంగా పాపవినాశనం రహదారిని టీటీడీ అధికారులు మూసేశారు. మరోవైపు భారీ వర్షాలతో తిరుపతి జలమయమైంది. అటు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. భారీ వర్షాలతో రేణిగుంట విమానాశ్రయంలో విమానాలు దిగాయి. మరోవైపు ఆర్జితం కార్యాలయం సమీపంలోని తిరుమల విపత్తు నిర్వహణ కేంద్రంలోపలికి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో ఆన్‌లైన్ సేవలకు అంతరాయం కలిగింది.