ఆంధ్రప్రదేశ్ : మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ విజయఢంకా మోగించింది. 13 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించగా.. 11 స్థానాలను అధికార పార్టీ కైవసం చేసుకొంది. నెల్లూరు కార్పొరేషన్ సహా 13 మున్సిపాలిటీలు, కొన్ని నగర పంచాయతీలు, మరో 10 మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ నేపథ్యంలో సీఎం జగన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయని చెప్పారు. గ్రామంతో పాటు నగరం కూడా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచిందని అన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్లు, సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు సీఎం జగన్.