జంగారెడ్డిగూడెం(ఆంధ్రప్రదేశ్) : పశ్చిమగోదావరిలో ఏపీ ఆర్టీసీ బస్సు కాల్వలో పడి ఐదుగురు మహిళలతో సహా పది మంది దుర్మరణం పాలైన ఘటన జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. నివేదికల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని జంగారెడ్డిగూడెం సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి జల్లేరు వాగులో పడిపోయింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు అశ్వారావుపేట నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తోంది.
అధికారులు మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం వెనుక కారణం ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు.