ఆంధ్రప్రదేశ్ : చంద్రబాబు చేసిన శపథంపై సీఎం జగన్ రియాక్ట్ అయ్యారు. ఆయన ప్రస్టేషన్ కు గురయ్యారని, ఆయనకు కేవలం రాజకీయ అజెండానే ముఖ్యమని ఎద్దేవా చేశారు. ఆయన కుటుంబసభ్యుల గురించి తాము మాట్లాడినట్లు బాబు చేసిన ఆరోపణలను సీఎం జగన్ తిప్పికొట్టారు. చంద్రబాబే అతిగా రియాక్ట్ అయ్యారని… చంద్రబాబు కుటుంబసభ్యుల గురించి ఎవరూ మాట్లాడలేదని చెప్పారు. ప్రతిపక్షాన్ని అసలు పట్టించుకోవడం లేదని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమను వేధిస్తున్నారంటూ..బాబు విమర్శలు గుప్పించారు. అనంతరం తాను సీఎం అయిన తర్వాతే..అసెంబ్లీలోకి అడుగుపెడుతానంటూ..శపథం చేసీ మరీ వెళ్లారు.
చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి ఎవరూ సభలో మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చారు సీఎం జగన్. ఆయనే తన చిన్నాన్న, చెల్లి గురించి మాట్లాడారన్నారు. గతంలో జరిగిన హత్యలపై విచారణ జరగాలని తమ సభ్యులు అంటే దాన్ని మరో రకంగా మార్చి డ్రామా క్రియేట్ చేశారని విమర్శించారు జగన్. గతంలో తన చిన్నాన్నను ఓడించారని, ఆయన్ను వాళ్లే ఏదో ఒకటి చేసి ఉంటారని వ్యాఖ్యానించారు సీఎం జగన్. చంద్రబాబు మాటలు చూస్తే ఒక్కోసారి బాధ అనిపిస్తుందన్నారు.
సీఎం జగన్ మాట్లాడుతూ ఆ సమయంలో తాను సభలో లేనని అన్నారు. తాను సభకు రాకముందు కలెక్టర్లతో వర్షాలపై సమీక్ష చేసినట్లుగా తెలిపారు. సభలోకి వచ్చేసరికి చంద్రబాబు ఎమోషనల్‌గా మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఫ్రస్టేషన్‌లో ఉన్నారు. చంద్రబాబు మీద తాము వ్యతిరేకంగా ఉన్నామని తీర్పిచ్చారు. ఊహించని విధంగా ప్రజల వ్యతిరేకత చూశారు. అసెంబ్లీలో కూడా వారికున్న బలం పూర్తిగా మారిపోయింది. అసెంబ్లీలో కూడా వైయస్సార్‌సీపీ బలం గణనీయంగా పెరిగింది.
రైతులకు సంబంధించిన అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు.. ఒకవైపున వర్షాల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్న సందర్భాల్లో .. ప్రతిపక్షం వచ్చి సూచనలు, సలహాలు ఇవ్వాలి కానీ అలా జరగడం లేదని సీఎం జగన్ అన్నారు. పలానా మాదిరిగా చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పొచ్చు. అలాంటి పరిస్థితిని పూర్తిగా పక్కనపెట్టేసి, ప్రజలు ఎలా ఉన్నా పర్వాలేదు, ప్రజలు ఎలా ఉన్నా అభ్యంతరం లేదు నా ఎజెండా రాజకీయ అజెండానే ప్రతి అంశంలోనూ.. నాకు రాజకీయ లబ్ధి జరగాలి, లబ్ధి చేకూర్చుకునేలా ప్రవర్తిస్తాను అనే ధోరణిలోకి చంద్రబాబు వెళ్లిపోతారని విమర్శించారు సీఎం జగన్.