Bright Telangana
Image default

Weather Alert : నేడు మరో అల్పపీడనం.. ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు

low pressures

ఆంధ్రప్రదేశ్ : ఏపీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరి ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. దాదాపు పదిరోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు అల్పపీడనం ఏర్పడే పరిస్థితులుండటంతో ఆయా జిల్లాలు ప్రజలు భయపడిపోతున్నారు.

ఈనెల 29 – 30 నాటికి దక్షిణ అండమాన్‌ వద్ద బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసినా.. అది అనుకున్నంత వేగంగా కదల్లేదు. ప్రస్తుతం ఇది బ్యాంకాక్ సమీపంలో కేంద్రీకృతమవడంతో అండమాన్ తీరానికి వచ్చేందుకు మరింత సమయం పట్టనుంది.

ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తుందని, ఆగ్నేయ-తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి తదుపరి 48 గంటల్లో వాయుగుండంగా మారుతుందని వెల్లడించింది. దీని ప్రభావం ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలపై ఉంటుందని తెలిపింది. డిసెంబరు 3వ తేదీ రాత్రి నుంచి 2 రోజులపాటు ఉత్తర కోస్తా, ఒడిశాలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

Related posts

Welfare Schemes: ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలు పేదలను సోమరులుగా మారుస్తున్నాయా?

Hardworkneverfail

Chandrababu: మీడియా ముందు వెక్కి వెక్కి ఏడ్చిన చంద్రబాబు..

Hardworkneverfail

AP CM Jagan: చంద్రబాబు కన్నీటిపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్..

Hardworkneverfail

Kadapa-Annamayya Project: చుక్క నీరు కూడా నిల్వ చేసే అవకాశం లేనంతగా ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది

Hardworkneverfail

Andhra Pradesh : అదుపుతప్పి వాగులో పడిపోయిన ఆర్టీసీ బస్సు.. పది మంది మృతి

Hardworkneverfail

Tirupati: తిరుపతిలో వింత ఘటన.. భూమిని చీల్చుకొని బయటకు వచ్చిన బావి..

Hardworkneverfail