Sunkesula Project Situation in AP : సుంకేసుల ప్రాజెక్టును కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది పైన నిర్మించారు. అయితే ఇప్పుడు సుంకేసుల ప్రాజెక్టు పెద్ద ప్రమాదంలో పడింది. మీది నుండి భారీ వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా సుంకేసుల ప్రాజెక్ట్‌కి భారీ నష్టం వచ్చే ఆవకాశం వుంది. ఎగువున వున్న తుంగభద్ర డ్యాం నుంచి నీరు విడుదల చేస్తే సుంకేసుల ప్రాజెక్ట్ భద్రత ప్రశ్నార్థకంగా మారనుంది.
ఈ సుంకేసుల ప్రాజెక్టుని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రాజెక్టు అన్ని కూడా అంటారు. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ లోనూ వందలాది గ్రామాలకు సాగునీరు, తాగునీరు అందిస్తోంది ఈ ప్రాజెక్టు. సుంకేసుల ప్రాజెక్టు నిర్వహణ ఇప్పుడు అత్యంత దయనీయ పరిస్థితుల్లో వుంది. సుంకేసుల ప్రాజెక్టుకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండువైపులా వుంటాయి. డ్యాంలో 30 క్రస్ట్ గేట్లు వుండగా 16 గేట్లు వర్క్ చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోకుంటే అన్నమయ్య ప్రాజెక్టు మాదిరి భారీ నష్టం వాటిల్లేలా వుంది.