యంగ్ రెబల్‌స్టార్ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది. ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ‘రాధేశ్యామ్’ ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ ఎట్టకేలకు విడుదలయ్యింది. వింటేజ్ ప్రేమకథా మూవీగా తెరకెక్కిన ఈ మూవీలో ప్రభాస్ పూర్తిస్థాయి లవర్‌బాయ్ పాత్ర పోషించారు. లిరికల్ వీడియో సాంగ్ ను చూస్తుంటే.. రాధే శ్యామ్ ఓ విజువల్ ట్రీట్‌గా ఉండనుందని తెలుస్తోంది. ఇక ఈ మూవీలో పూజ హెగ్డే హీరో హీరోయిన్’గా చేస్తోంది. ప్రేరణ పాత్రలో పూజా కనపడనుంది.
ఈ మూవీని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ వస్తోంది. సుమారు రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నఈ సినిమా సంక్రాంతి బరిలో దిగనుంది. రాధేశ్యామ్ జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.