Radhe Shyam Third Single : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా వస్తోన్న ‘రాధే శ్యామ్’ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రమోషన్ వీడియోలు, సాంగ్స్ కు నుంచి విశేషమైన ఆదరణ లభించింది. ఈరోజు మూడో సింగల్ ‘సంచారి’ని మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్ లో ప్రభాస్ స్టయిలిష్ లుక్ లో ఉన్నారు. సాంగ్ మొత్తాన్ని విదేశాల్లోనే చిత్రీకరించారు. ఈ సాంగ్ ను కృష్ణకాంత్ రాశారు.
‘రాధే శ్యామ్’ మూవీకి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు మరియు ఈ మూవీని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ వస్తోంది. ‘రాధే శ్యామ్’ మూవీని సుమారు రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. గోపీకృష్ణ మూవీస్‌తో పాటు యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నఈ మూవీ జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.