Bright Telangana
Image default

Radhe Shyam Teaser : మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన రాధేశ్యామ్ టీజర్..

Radheshyam Teaser Introducing Prabhas as Vikramaditya

యంగ్‌ రెబల్‌స్టార్‌ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది. ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’ టీజర్‌ ఎట్టకేలకు విడుదలయ్యింది. వింటేజ్‌ ప్రేమకథా మూవీగా తెరకెక్కిన ఈ మూవీలో ప్రభాస్‌ పూర్తిస్థాయి లవర్‌బాయ్‌ పాత్ర పోషించారు. శనివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘రాధేశ్యామ్‌’ టీజర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇందులో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే హస్తసాముద్రిక నిపుణుడి(palmist) పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్‌ లుక్‌, డైలాగ్‌లు, హావభావాలు ఆకట్టుకునేలా ఉన్నాయి.

టీజర్‌ను చూస్తుంటే.. రాధే శ్యామ్ ఓ విజువల్ ట్రీట్‌గా ఉండనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో పూజ హెగ్డే హీరో హీరోయిన్’గా చేస్తోంది. ప్రేరణ పాత్రలో పూజా కనపడనుంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ వస్తోంది. సుమారు రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నఈ సినిమా సంక్రాంతి బరిలో దిగనుంది. రాధేశ్యామ్ జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

Related posts

Raja Vikramarka: ‘రాజా విక్రమార్క’ ట్రైలర్‌.. దీపావళి గ్రాండ్‌గా ప్లాన్‌ చేసిన కార్తికేయ!

Hardworkneverfail

Jai Bhim: సూర్య ‘జై భీమ్‌’ టీజర్‌ చూశారా?

Hardworkneverfail

Bheemla Nayak: అభిమానులకు సర్‌ప్రైజ్‌.. ‘లాలా భీమ్లా’ వీడియో ప్రోమో అదిరింది!

Hardworkneverfail

Adipurush Movie : సంక్రాంతి నుండి ఆదిపురుష్ అవుట్..?

Hardworkneverfail

Unstoppable 2 : అలరిస్తున్న ప్రభాస్, గోపీచంద్ అన్ స్టాపబుల్ ప్రోమో..

Hardworkneverfail

Akhanda Trailer: ‘అఖండ’ ట్రైలర్.. అఘోరగా బాలయ్య నట విశ్వరూపం..

Hardworkneverfail