Adipurush Movie Out of Sankranti Race : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ నిన్నటి వరకు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంత భావించారు. కానీ ఇప్పుడు సంక్రాంతి కాకుండా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి , సాహో , రాధే శ్యామ్ మూవీస్ తో నార్త్ లోను సత్తా చాటిన ప్రభాస్..ఇప్పుడు ఆదిపురుష్ అంటూ రామాయణ కథ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ప్రభాస్, కృతి సనన్ జంటగా టి సిరీస్, రెట్రో ఫైల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నయ్యర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు కానీ ఇప్పుడు సంక్రాంతి కి కాకుండా సమ్మర్ లో రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవల ‘ఆదిపురుష్’ మూవీ టీజర్ కు మిశ్రమ స్పందన వచ్చిన నేపథ్యంలో.. వీఎఫ్ఎక్స్ మరియు కంప్యూటర్ గ్రాఫిక్స్ మరింత మెరుగ్గా తీర్చి దిద్దబోతున్నారని , అందుకే మూవీని వాయిదా వేస్తున్నట్లు అంటున్నారు. మరికొంతమంది మాత్రం సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్య, వీర నరసింహ రెడ్డి , వారసుడు మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఆదిపురుష్ మూవీని వాయిదా వేస్తున్నారని అంటున్నారు. మరి నిజంగా వాయిదా పడుతుందా..? వాయిదాకు కారణాలు ఏంటి అనేవి మూవీ యూనిట్ అధికారికంగా తెలుపాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా.. కృతిసనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నారు. చూడాలి మరి బాక్సాఫీస్ వద్ద ఆదిపురుష్ మూవీ ఎలాంటి అద్భుతాలు సృష్టించనుందో!