Bright Telangana
Image default

ఆదిపురుష్ మూవీ టీసర్ రివ్యూ.. భారీ విజువల్ వండర్ అనుకున్నారు.. కానీ!!

Adipurush teaser review

Adipurush Teaser Review : రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు సినీ లోకం ఎదురుచూస్తున్న ఆదిపురుష్ మూవీ టీజర్ వచ్చేసింది. కృష్ణం రాజు మరణంతో శోకసంద్రంలో ఉన్న రెబెల్ అభిమానులకు కాస్త ఉపశమనం కల్పించారు ఆదిపురుష్ మూవీ టీం. ఆదిపురుష్ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ను మేకర్స్ ఈరోజు ఆదివారం రిలీజ్ చేసారు.

రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా టి సిరీస్, రెట్రో ఫైల్స్ సంయుక్తం నిర్మిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక మూవీ ఆదిపురుష్. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నయ్యర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. చెడు పై మంచి గెలిచే యుద్ధం అంటూ ఈ మూవీని ప్రమోట్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. రామాయణం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ఓం రౌత్. భారీ బడ్జెట్‌తో ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్‌పై చూడనటువంటి అత్యద్భుతమైన విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ లుక్స్‌కు మంచి అప్లాజ్ వచ్చింది. ఇక ఆదివారం ఫస్ట్ టీజర్ ను రిలీజ్ చేసారు.

ఇక టీసర్ విషయానికి వస్తే ప్రభాస్ లుక్ పై కొంచం మిక్సుడ్ రెస్పాన్స్ అయితే వచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు, ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ ఇలా ఉండబోతున్నాడు, అలా ఉండబోతున్నాడు అంటూ ఫ్యాన్ మేడ్ పోస్టర్ లు చాలా రిలీజ్ అయ్యాయి. అవన్నీ ఒకటికి మించి ఒకటి ఉండటంతో అఫీషియల్ లుక్ ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో అని అందరూ అనుకున్నారు కానీ అలాంటిదేమీ జరగలేదు. బాహుబలి మూవీలో ప్రభాస్ లుక్ కి ఇప్పుడు ఆది పురుష్ మూవీలో లుక్ కి కంపేర్ చేస్తే పాస్ మార్కులు కూడా కష్టమే..

ఇక మూవీ టీసర్ ను భారీ గ్రాఫిక్స్ తో రూపొందించాము అని చెప్పారు కానీ టీసర్ లో గ్రాఫిక్స్ ఏం అనుకున్న రేంజ్లో లేవు. ఓవరాల్ గా మూవీ ఓ విజువల్ వండర్ లా ఉండబోతుంది కానీ ఈ టీసర్ మట్టుకు ఆడియన్స్ లో ఓ మిక్సుడ్ ఫీలింగ్స్ ని కలిగించింది అని చెప్పాలి.

టీసర్ లో సీతగా కృతి సనన్ 2 సీన్స్ లో కనిపించగా రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ తన మార్క్ స్క్రీన్ ప్రజెన్స్ తో మెప్పించాడు, మెయిన్ లీడ్ తప్పితే మిగిలిన వాళ్ళు అందరూ మోషన్ కాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఆది పురుష్ మూవీ చూడటానికి భారీ విజువల్ వండర్ లా అనిపించినా క్వాలిటీ పరంగా ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది, మరి రిలీజ్ టైం కి టీం ఇంకా బాగా మూవీని తీర్చిదిద్దాలని ఆశిద్దాం.

Related posts

Radhe Shyam First Song : ఈ రాతలే లిరికల్ వీడియో సాంగ్..రాధేశ్యామ్ నుంచి తొలి సాంగ్ విడుదల

Hardworkneverfail

Radhe Shyam Teaser : మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన రాధేశ్యామ్ టీజర్..

Hardworkneverfail

Radhe Shyam Movie Trailer : మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన ‘రాధేశ్యామ్’

Hardworkneverfail

Radhe Shyam Trailer Launch : మరికొన్ని గంటల్లో రాధేశ్యామ్ ట్రైలర్.. ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా..!

Hardworkneverfail

Radhe Shyam Movie : గుండె బరువెక్కించే సోచ్ లియా సాంగ్.. ‘రాధే శ్యామ్’ నుండి మ‌రో సాంగ్ రిలీజ్

Hardworkneverfail

Adipurush Trailer : అహంకారపు రొమ్ము చీల్చడానికి దూకండి ముందుకి..

Hardworkneverfail