Soch Liya Song From Radhe Shyam Movie : హీరో ప్రభాస్ ‘రాధేశ్యామ్’ మూవీ నుంచి మరో సాంగ్ వచ్చేసింది. అయితే, ఈసారి కేవలం హిందీ సాంగ్ ను మాత్రమే విడుదల చేశారు మేకర్స్. ‘సోచ్ లియా’ అంటూ సాగే ఈ సాంగ్ లో.. ప్రభాస్, పూజా హెగ్డేల ఎమోషన్ సీన్స్ బాగున్నాయి. ప్రభాస్, పూజా హెగ్డే.. ఇద్దరూ ఈ సాంగ్ లో చాలా అందంగా కనిపించారు. ఈ పాటను చూస్తుంటే.. పూర్తిగా ప్రేమలో మునిగిన ప్రభాస్, పూజా హెగ్డేల మధ్య బ్రేకప్ అయినట్లు అనిపిస్తుంది. ఈ సాంగ్ ఆరంభమే చక్కని ఫీలింగ్‌తో మొదలవుతుంది. ఆ తర్వాత.. ఒకరి కోసం ఒకరు మదన పడుతున్నట్లుగా ఈ వీడియో సాంగ్ లో చూపించారు. తర్వాత కొన్ని రొమాంటిక్, మెమోరీ సీన్స్‌తో ఈ సాంగ్ నడుస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నఈ మూవీ జనవరి 14న విడుదలకానుంది.