Radhe Shyam Direct OTT Release : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు పూజ హెగ్డే కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’. యూవీ క్రియేషన్స్ .. టి – సిరీస్ మరియు గోపీకృష్ణ మూవీస్ వారు కలిసి 350 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ, ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ. తాను మనసిచ్చిన ఒకమ్మాయి జాతకమేమిటో తెలిసిన హీరో, ఆమెను దక్కించుకోవడం చేసే సాహసమే ‘రాధేశ్యామ్’ మూవీ.
సంక్రాంతి కానుకగా ఈ మూవీని విడుదల చేయాలనుకున్నారు.. కానీ కరోనా మూడోవ వేవ్ రావడంతో వాయిదా వేసుకున్నారు. దాంతో ‘రాధేశ్యామ్’ మూవీ వేసవిలో థియేటర్లకు వస్తుందని అంతా అనుకుంటున్నారు. కానీ ఈ మూవీ ఓటీటీకి(Radhe Shyam Direct OTT Release) ఇచ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్ నడుస్తోంది.
కరోనా మూడోవ వేవ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు అలాగే అన్ని ప్రాంతాల్లో ఒకేసారి తగ్గుముఖం పట్టే అవకాశాలు లేకపోవడం .. అప్పటివరకూ ఎదురుచూడలేని పరిస్థితి ఉండటం .. ఈలోపు ఓటీటీ నుంచి భారీ ఆఫర్ రావడం కారణంగా మూవీ మేకర్స్ ఆ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి.