ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ప్రేమకథా మూవీ ‘రాధే శ్యామ్’. ఇందులోని తొలి పాట ‘ఈ రాతలే…’ను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ఇప్పుడు రెండో సాంగ్ ‘ఆషికి ఆగయి’ అనే సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ చిన్న సాంగ్ టీజర్ లో ప్రభాస్, పూజా హెగ్డే మధ్య ఉన్న గాఢమైన ప్రేమ, సముద్ర తీరాన అందమైన విజువల్స్ ను చూపించారు. ఈ రొమాంటిక్ సాంగ్ ను అర్జిత్ సింగ్, మిథున్ పాడారు. లిరిక్స్ తో పాటు.. పాటను కంపోజింగ్ చేసింది కూడా మిథున్ కావడం విశేషం. డిసెంబర్ 1న ఫుల్ సాంగ్ విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. మొదటగా హిందీ వెర్షన్ సాంగ్ రిలీజ్ చేశారు. రాత్రి 7 గంటలకు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం… దక్షిణాది భాషల్లో సాంగ్ టీజర్ విడుదల చేశారు.
ఈ మూవీని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ వస్తోంది. సుమారు రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నఈ మూవీ జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.