Bright Telangana
Image default

Box Office Report : రాధే శ్యామ్ హిందీ, ET మూవీ టోటల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్

Radhe Shyam Direct OTT Release

Radhe Shyam Movie Hindi Version Break Even Target : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ ఆడియన్స్ రేపు (మార్చి 11న) రావడానికి సిద్ధం అవుతుంది, బాహుబలి సిరీస్ తో నేషనల్ వైడ్ క్రేజ్ ను సొంతం చేసుకున్న ప్రభాస్ ఆ మూవీ తర్వాత చేసిన సాహో మూవీ డిసాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా హిందీ లో మాత్రం డిసాస్టర్ టాక్ తోనే మూవీ సూపర్ హిట్ గా నిలిచి అక్కడ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది, అలాంటి విజయం తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న రాధే శ్యామ్ మూవీ పై మరీ సాహో మూవీ రేంజ్ లో అంచనాలు హిందీ లో ప్రస్తుతానికి లేవు కానీ అంచనాలు మాత్రం అయితే కచ్చితంగా ఉన్నాయి అని చెప్పాలి.

ఒక్కసారి మూవీ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ని కనుక సొంతం చేసుకుంటే హిందీ లో కలెక్షన్స్ ఓ రేంజ్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉండగా మూవీని ఇప్పుడు ఓవరాల్ గా నార్త్ ఇండియా కి గాను మొత్తం మీద 50 కోట్ల రేంజ్ రేటు కి అమ్మినట్లు ట్రేడ్ లో సమాచారం అయితే ఉంది.

మొత్తం మీద 50 కోట్ల రేంజ్ బిజినెస్ ను హిందీ లో సొంతం చేసుకున్న రాధే శ్యామ్ మూవీ ఇప్పుడు అక్కడ మొత్తం మీద 110 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాలి. ఇక నెట్ కలెక్షన్స్ లో 50% టాక్స్ లు రెంట్స్ మరియు మెయింటైనెన్స్ లు కట్ అయ్యాక షేర్ వస్తుంది. ఓవరాల్ గా సాహో మూవీ కలెక్షన్స్ లో సగాని కన్నా ఎక్కువ టార్గెట్ తో బరిలోకి దిగుతున్న రాధే శ్యామ్ మూవీ ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన కానీ హిందీ లో బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం బాగానే ఉంటుంది అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్ ఈ మూవీ తో అక్కడ ఎలాంటి రాంపేజ్ చూపెడుతాడో అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు.

et movie

సూర్య ET మూవీ టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్

ET Movie World wide Break Even Target : బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ మూడు సంవత్సరాల తర్వాత సూర్య నటించిన లేటెస్ట్ మూవీ రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, లాస్ట్ రెండు సంవత్సరాలలో సూర్య నటించిన 2 మూవీస్ కూడా థియేటర్స్ లో కాకుండా డిజిటల్ లో డైరెక్ట్ గా రిలీజ్ అవ్వగా ఎట్టకేలకు ఇప్పుడు సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ET మూవీ ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా తెలుగు లో మూవీ మొత్తం మీద 3.50 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకున్న మూవీ బ్రేక్ ఈవెన్ కోసం మూవీ 4 కోట్ల మార్క్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక ఓవరాల్ గా మూవీ తమిళ్ లో పాటు మొత్తం మీద సాధించిన బిజినెస్ లెక్కలు ట్రేడ్ లో ఈ విధంగా ఉన్నాయి అని చెప్పాలి.

ET మూవీ తమిళనాడు 33 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుంది, ఇక కర్ణాటకలో 2.5 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను మరియు కేరళలో 1.5 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుంది, ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా లో మూవీ సుమారుగా 1.5 కోట్ల బిజినెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. దాంతో మూవీ ఇప్పుడు ఓవరాల్ గా ఇండియాలో 42 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుందని అంటున్నారు.

ఇక ET మూవీ తెలుగు బిజినెస్ విషయానికి వస్తే నైజాం ఏరియాలో మూవీ 1.2 కోట్ల బిజినెస్ జరగగా, సీడెడ్ లో 80 లక్షల రేంజ్ లో మరియు ఆంధ్ర రీజన్ లో 1.5 కోట్ల రేంజ్ లో బిజినెస్ ఓవరాల్ గా జరిగినట్లు సమాచారం. దాంతో ET మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు తెలుగు లో హిట్ అవ్వాలి అంటే మినిమమ్ 4 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాలి. సోలో రిలీజ్ అయ్యి ఉంటే ఈ మార్క్ ని అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు కానీ ఇప్పుడు రాధే శ్యామ్ మూవీ లాంటి మూవీ తో పోటి లో ఈ మూవీ ఎంతవరకు ఈ కలెక్షన్స్ ని అందుకుంటుంది అన్నది ఆసక్తి కరం, కొంచం గ్యాప్ తర్వాత కమర్షియల్ మూవీ చేస్తున్న సూర్య ఈ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పాలి.

ఇక ఓవర్సీస్ మొత్తం మీద మూవీ కి 11.50 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా మూవీ 53.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకుంది. ఈ లెక్కన ET మూవీ వరల్డ్ వైడ్ గా 110 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది.

ఇక తెలుగు లో ET మూవీ బుకింగ్స్ చాలా స్లోగా ఉండగా మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి రిలీజ్ కాబోతున్న మూవీ తెలుగు రాష్ట్రాలలో 430 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఫస్ట్ డే టాక్ బాగుంటే 80 లక్షల నుండి 1 కోటి రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉంటుంది. మరి మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

Related posts

Radhe Shyam Second Single : మైండ్ బ్లోయింగ్ మెలోడీ.. ‘రాధే శ్యామ్’ రెండో సాంగ్

Hardworkneverfail

Radhe Shyam Teaser : మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన రాధేశ్యామ్ టీజర్..

Hardworkneverfail

Radhe Shyam First Song : ఈ రాతలే లిరికల్ వీడియో సాంగ్..రాధేశ్యామ్ నుంచి తొలి సాంగ్ విడుదల

Hardworkneverfail

Radhe Shyam Third Single : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ నుంచి ‘సంచారి’ .. వీడియో సాంగ్

Hardworkneverfail

Radhe Shyam Movie : గుండె బరువెక్కించే సోచ్ లియా సాంగ్.. ‘రాధే శ్యామ్’ నుండి మ‌రో సాంగ్ రిలీజ్

Hardworkneverfail

Radhe Shyam Soch Liya (Teaser) : సోచ్ లియా.. ‘రాధే శ్యామ్’ మూవీ సింగిల్ టీజర్

Hardworkneverfail