Bright Telangana
Image default

Hit 2 Trailer : మరో ‘హిట్’ గ్యారెంటీ.. అదిరిపోయిన ‘హిట్ 2’ ట్రైలర్

Hit 2 Trailer

Hit 2 Trailer : విశ్వక్ సేన్ హీరోగా నాచురల్ స్టార్ నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మూవీ ‘హిట్’. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఆ మూవీకి సీక్వెల్ ఉంటుందని అప్పుడే మేకర్స్ ప్రకటించారు. కాగా రెండేళ్ళ తర్వాత ఈ మూవీకి సీక్వెల్‌ తెరకెక్కింది. హిట్ 2(Hit 2) మూవీలో టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటిస్తున్నాడు. మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, టీజర్‌ మూవీపై విపరీతమైన అంచనాలు క్రియేట్‌ చేశాయి. తాజాగా చిత్రబృందం ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్‌ చేసింది. ఉత్కంఠ భరితంగా సాగిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

పోలీసులకు చిక్కకుండా వరుస హత్యలు చేస్తున్న హంతకుడిని అడివిశేష్ ఎలా పట్టుకున్నాడు అనే నేపథ్యంలో మూవీ తెరకెక్కింది. ట్రైలర్‌ ప్రారంభంలో ఒక అమ్మాయినే హత్య చేశారని అందరూ అనుకుంటుండగా.. చివర్లో తల ఒకరిది, కాళ్లు ఒకరివి, చేతులు ఒకరివి అంటూ రివీల్‌ చేయడం గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. జాన్‌ స్టీవర్ట్ నేపథ్య సంగీతం థ్రిల్‌ ఫీల్‌ను కలిగిస్తుంది. మణికందన్‌ కెమెరా విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్‌తోనే మూవీపై విపరీతమైన ఆసక్తి పెరిగింది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ హిట్‌ యూనివర్స్‌లో భాగంగా రూపొందింది.

హిట్ 2 మూవీ డిసెంబర్‌ 2న పాన్‌ తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. అలాగే హిట్ వర్స్ అని ఒక లోకం సృష్టించి వరుసగా 7 సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఒక్కో మూవీలో ఒక్కో హీరో ఉండనున్నట్టు, మధ్యలో ఆ హీరోలు కలవొచ్చు అన్నట్టు దర్శకుడు శైలేష్ కొలను చెప్పడంతో ఈ మూవీపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ‘మేజర్’ మూవీతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న అడివి శేష్.. ఇప్పుడు నాని తో కలిసి ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Related posts

Major Movie: అడివి శేష్ ‘మేజర్’ మ్యూజిక్ రైట్స్ వారికే..

Hardworkneverfail

Adivi Seshs Major : ‘వినవే హృదయమా’.. సిద్ శ్రీరామ్ మరో క్లాసిక్ సాంగ్

Hardworkneverfail

Adivi Sesh Hit 2: అడివి శేష్ హిట్ 2 నుంచి ఫస్టు గ్లింప్స్ విడుదల..

Hardworkneverfail