Konda Polam Movie OTT Rights : వైష్ణవ్ తేజ్ హీరోగా.. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్, జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘కొండపొలం’. జే సాయి బాబు, వై రాజీవ్ రెడ్డి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన ‘కొండపొలం’ మూవీ అక్టోబర్ 8న విడుదలయ్యింది. మార్నింగ్ షో తోనే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ రావడంతో ప్రేక్షకులు ఈ మూవీ పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఆశించిన రీతిలో ఈ మూవీ ఫలితం సాధించడంలో విఫలమైంది. ఈ మూవీ ఫుల్ రన్ ముగిసేసరికి కేవలం రూ.3.90 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.
ఇక అది అలా ఉంటే ‘కొండపొలం’ మూవీ ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘కొండపొలం’ మూవీ డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నారు. ఈ మూవీ డిసెంబర్ 7 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.