Bright Telangana
Image default

Omicron Variant : ఒమిక్రాన్ కలకలం.. బాధిత వ్యక్తి నుంచి మరో ఐదుగురికి పాజిటివ్!

Omicron Variant in indai

Omicron Variant : కరోనా డెల్టా వేరియంట్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోన్న తరుణంలో దక్షిణాఫ్రికాలో మరో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వెలుగులోకి వచ్చి మరోసారి అందరినీ భయాందోళనకు గురి చేస్తోంది. ఇండియా లోనూ ఒమిక్రాన్ ప్రవేశించిందన్న కేంద్రం ప్రకటనతో రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. ఇండియాలో వెల్లడైన రెండు ఒమిక్రాన్ కేసులు కర్ణాటకలో గుర్తించారు.. అయితే నవంబర్‌ 11న ఓ 66ఏళ్ల వ్యక్తి బెంగుళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చాడు, నవంబర్‌ 20న 46 ఏళ్ల మరో వ్యక్తి కూడా బెంగుళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చాడు.

అయితే అందరికీ చేసినట్లుగానే వీరికి కరోనా పరీక్షలు నిర్వహించగా వీరిద్దరికీ ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకినట్లు నిర్థారణైంది. అయితే తాజాగా వీరి కాంటాక్టు లిస్టులో ఉన్న వారికిసైతం వైద్యాధికారులు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో 46 ఏళ్ల వ్యక్తి ప్రైమరీ కాంటాక్టులో 5 గురికి కరోనా నిర్థారణైంది. అయితే వీరి శాంపిల్స్‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి ఆ ఐదుగురిని వెంటనే ఐసోలేషన్‌లో ఉంచినట్టు కర్నాటక ప్రభుత్వం వెల్లడించింది. వారిలో ఎవరికీ ప్రమాదకర పరిస్థితి లేదని, వారందరూ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారేనని మంత్రి తెలిపారు.

Related posts

Omicron Variant India Cases : ఇండియాలో 21కి చేరిన ఒమిక్రాన్‌ కేసులు..

Hardworkneverfail

Central Government Alert : మూడు రేట్లు వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి..

Hardworkneverfail

Omicron Cases in Telangana : తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు

Hardworkneverfail

CM KCR : తెలంగాణలో లాక్ డౌన్ అవసరం ప్రస్తుతం లేదు.. కేసీఆర్

Hardworkneverfail

Third Wave LIVE Updates : మొదలైన థర్డ్ వేవ్..లాక్ డౌన్ దిశగా ఇండియా..

Hardworkneverfail