Bright Telangana
Image default

Planes Crash : ఎయిర్‌షోలో విషాదం.. ఎదురెదురుగా ఢీకొన్న యుద్ధ విమానాలు

two planes collided at air show

Planes Crash : అమెరికాలో డాలస్ దగ్గర జరుగుతున్న ఎయిర్‌షోలో రెండో ప్రపంచ యుద్ధానికి చెందిన రెండు పాతకాలపు యుద్ధ విమానాలు.. ఆకాశంలో ఢీకొని కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. నివేదికల ప్రకారం.. రెండు విమానాల్లోని పైలట్ల పరిస్థితి ఇంకా తెలియాల్సి ఉందని యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) తెలిపింది. ఈ ప్రమాదం మధ్యాహ్నం 12గంటల సమయంలో చోటు చేసుకుంది. రెండో ప్రపంచ యుద్ధం స్మారకంగా డల్లాస్‌ ఎగ్జిక్యూటివ్‌ విమానాశ్రయంలో ఎయిర్‌ షో నిర్వహిస్తున్నారు.

బాంబర్‌ విమానం గాలిలోకి ఎగిరి భూమికి కొంత ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో బెల్‌ పీ-63 కింగ్‌కోబ్రా అనే ఫైటర్‌ విమానం దానిని ఢీకొట్టింది. దీంతో రెండు విమానాలు కూలిపోయాయి. ఆ ప్రాంతంలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. విమానాలు ఢీకొని నేలకూలడంతో భారీగా మంటలు చెలరేగాయి. 40కి‌పైగా అగ్నిమాపక దళ వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. శిథిలాల నుంచి ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించాయి. రెండు విమానాల్లో పైలట్‌తో సహా ఆరుగురు ఉన్నారు. వారంతా మరణించారని అధికారులు తెలిపారు. ఘటనపై ఎఫ్ఏఏ, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించాయి.

Related posts

Gun Fire : అమెరికాలో కాల్పులు.. నల్గొండ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి

Hardworkneverfail

ప్రపంచంలో ఇప్పుడు అత్యంత సంప‌న్న దేశంగా చైనా..!

Hardworkneverfail

KTR US Tour : తెలంగాణకు పెట్టుబడుల వరద.. అమెరికాలో ముగిసిన మంత్రి కేటీఆర్ పర్యటన

Hardworkneverfail