Bright Telangana
Image default

Unstoppable With NBK : బాలకృష్ణ షోలో చిరంజీవి గురించి మోహన్‌ బాబు ఏమన్నారంటే?

Unstoppable With NBK- Mohan babu say about Chiranjeevi in Balakrishna show

బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’. తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ఈ షో ప్రసారమవుతోంది. ఇక ఈ ప్రోగ్రాం కి ‘జాంబీ రెడ్డి’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు.దీపావళి సందర్భంగా బాలకృష్ణ తొలి ఇంటర్వ్యూ ను మోహన్‌ బాబుతో చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ అడిగిన పలు ప్రశ్నలకు మోహన్‌ బాబు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. అంతేకాదు, మోహన్‌ బాబు కూడా బాలకృష్ణను ఎదురు ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు.

షోలో భాగంగా ‘చిరంజీవిపై మీకున్న అభిప్రాయం ఏంటి? అని మోహన్‌ బాబును అడగ్గా ‘చిరంజీవి మంచి నటుడు, అద్భుతంగా డ్యాన్స్‌ చేస్తాడు. వ్యక్తిగతంగా అతనిపై ఎలాంటి చెడు అభిప్రాయం లేదు. అల్లు రామలింగయ్యగారి కుమార్తె సురేఖను పెళ్లి చేసుకున్నాడు. ఆయనతో కలిసి ఎన్నో సినిమాలు చేశా. సురేఖ నాకు సోదరిలాంటిది. అంటే మన ఇంటి అమ్మాయిని చిరంజీవి పెళ్లి చేసుకున్నాడు. కాబట్టే అతను బాగున్నాడు’ అని సమాధానం ఇచ్చారు మోహన్‌ బాబు. ఇక మద్యం సేవించే అలవాటుపై మోహన్‌ బాబు మాట్లాడుతూ.. ‘మద్రాసులో ఉన్న రోజుల్లో కోడంబాకం బ్రిడ్జ్‌ కింద సారా దుకాణాలు ఉండేవి. ఒక స్నేహితుడితో కలిసి వెళ్లి అక్కడ సారా తాగేవాడిని. ఆ విధంగా జీవితం ప్రారంభమై, లేని రోజుల్లోనూ తాగాను. ఇప్పుడు భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి మంచి విస్కీ తాగుతున్నా’ అని అన్నారు.

Related posts

Unstoppable 2 : అలరిస్తున్న ప్రభాస్, గోపీచంద్ అన్ స్టాపబుల్ ప్రోమో..

Hardworkneverfail

Bhola Shankar Movie: చిరంజీవి ‘బోళా శంకర్’ మూవీ ప్రారంభం..

Hardworkneverfail

Unstoppable With NBK : నేను ‘విలన్‌గా చేయడానికి రెడీ’.. బాలకృష్ణ

Hardworkneverfail

Acharya Movie : ‘ఆచార్య’ మూవీ ఓటిటి డీల్ క్లోజ్..!

Hardworkneverfail

Rana in Unstoppable with NBK : రానా తో సందడి చేయబోతున్న బాలయ్య..!

Hardworkneverfail

Kaikala Satyanarayana: కైకాల సత్యనారాయణ త్వరలోనే ఇంటికి తిరిగివస్తారు : చిరంజీవి

Hardworkneverfail