Unstoppable With NBK : ‘ఓటీటీ’లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘అన్ స్టాపబుల్’ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తుండడం తెలిసిందే. ఈ షోలో ఇప్పటివరకు మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం మరియు డైరెక్టర్ అనిల్ రావిపూడి వచ్చేసి సందడి చేశారు.
నందమూరి బాలకృష్ణ తాజా మూవీ ‘అఖండ’ సక్సెస్ తో దూసుకుపోతున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 2న ఆడియన్స్ ముందుకు వచ్చి విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. తాజాగా బాలకృష్ణ ‘ఆహా’లో చేస్తున్న అన్‌స్టాపబుల్ షోకి అఖండ మూవీ టీమ్ హాజరైంది. 4th ఎపిసోడ్‌కు శ్రీకాంత్, బోయపాటి శ్రీను, ప్రగ్యా జైస్వాల్, థమన్ అతిథులుగా హాజరయ్యారు. తాజాగా బాలకృష్ణ 4th ఎపిపోడ్‌కు సంబంధించిన ప్రోమో మేకర్స్ విడుదల చేశారు.
ఈ ప్రోమోలో.. ప్రగ్యా జైస్వాల్.. బాలయ్యను సార్ అని పిలవగానే.. బాలయ్య ‘సార్’ అనటం… వెంటనే ప్రగ్యా జైస్వాల్ ‘బాలా’ అని సంబోధించటం ఫన్నీగా అనిపిస్తుంది. ఇక బాలకృష్ణ మాట్లాడుతూ నేను ‘విలన్‌గా చేయడానికి రెడీ’ కానీ అని.. కొంచెం పాస్ తీసుకుని ‘హీరో కూడా నేనే…’ అనేయటం బాగుంది. ఈ ప్రోమోతో ఎపిసోడ్‌పై అంచనాలు పెరిగాయి. ఈ ప్రోమోకు సంబంధించిన ఈ ఎపిసోడ్ డిసెంబర్ 10న ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది.