Balakrishna Upcoming Movie Update : నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ మూవీ కోసం సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. బాలకృష్ణ నెక్స్ట్ మూవీ గోపీచంద్ మలినేనితో ఉన్న సంగతి తెలిసిందే. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఈ కథ నడవనుంది. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో, విల్లన్ గా దునియా విజయ్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ మూవీ తరువాత డైరెక్టర్ అనిల్ రావిపూడితో బాలకృష్ణ ఓ మూవీ చేయనున్నాడు.
బాలకృష్ణకి కథ చెప్పేసి ఓకే చేయించుకున్న అనిల్ రావిపూడి, ప్రస్తుతం ‘ఎఫ్ 3’ మూవీ చేస్తున్నాడు. ఏప్రిల్ 29వ తేదీన ఈ మూవీని విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల కాగానే రెండు నెలల పాటు స్క్రిప్ట్ పై కసరత్తును పూర్తి చేసి, జూలై నుంచి సెట్స్ పైకి వెళ్లాలనే ఆలోచనలో అనిల్ రావిపూడి ఉన్నాడట.
ఈ సినిమాను 2023 సంక్రాంతి బరిలో నిలబెట్టాలనే నిర్ణయంతో ఆయన ఉన్నాడని అంటున్నారు. నిజానికి అనిల్ రావిపూడికి సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. ‘ఎఫ్ 3’ మూవీని ఈ సంక్రాంతి బరిలో దింపాలనే ఆయన అనుకున్నాడు గానీ కుదరలేదు. అందువలన బాలకృష్ణ మూవీకి వచ్చే సంక్రాంతిని టార్గెట్ గా పెట్టుకున్నాడట. ఈ మూవీలో హీరోయిన్ గా మెహ్రీన్ పేరే వినిపిస్తోంది! Balakrishna upcoming Movie Update