Break Even Akhanda Movie in Nizam Area : నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘అఖండ’ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఫస్ట్ వీకెండ్ పూర్తీ అయ్యే టైం కి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఈ మూవీ. 4 వ రోజు అంచనాలను మరో సారి మించి పోయే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న అఖండ మూవీ ఇప్పుడు 4 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో మరో ఏరియాలో బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుంది.
నైజాం ఏరియాలో 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని లాభాలను కూడా సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి. నైజాం ఏరియాలో ఈ మూవీ మీద 10.5 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా ఫస్ట్ డే మొత్తం మీద 4.40 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని , సెకండ్ డే 2.32 కోట్ల షేర్ తో ఎక్స్ లెంట్ హోల్డ్ ని సొంతం చేసుకుంది. ఇక మూవీ 3rd డే గ్రోత్ చూపెట్టి 2.48 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని రచ్చ చేయగా ఇక 4th డే మరో లెవల్ కి చేరేలా దుమ్ము లేపిన ఈ మూవీ ఏకంగా 2.90 కోట్ల షేర్ ని అందుకుని కలెక్షన్లా సునామి సృష్టించింది.
దాంతో ‘అఖండ’ మూవీ 4 డేస్ పూర్తీ అయ్యే టైం కి 12.10 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని నైజాం ఏరియాలో బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని లాభాలను సొంతం చేసుకుంది. ఇక సోమవారం కూడా హోల్డ్ చేస్తే ఇక్కడ లాంగ్ రన్ లో ‘అఖండ’ మూవీ అద్బుతాలు సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.