Bright Telangana
Image default

WhatsApp Web: వాట్సాప్​ కొత్త ఫీచర్.. ఇంటర్​నెట్​ లేకున్నా​ వాడొచ్చు..

HOW YOU CAN CHAT WITH YOURSELF ON WHATSAPP

వాట్సాప్​ యూజర్ల కోసం కొత్త ఫీచర్​ పై పనిచేస్తోంది. సాధారణంగా, కంప్యూటర్​ లేదా ల్యాప్​టాప్​లో వాట్సాప్​ వెబ్ వాడాలంటే వాటికి కనెక్ట్​ చేసిన ఫోన్​లో ఇంటర్నెట్​ కచ్చితంగా ఆన్​ చేసి ఉండాల్సిందే. ఒకసారి వాట్సాప్​ వెబ్​లో లాగిన్​ అయ్యి.. ఆ తర్వాత ఫోన్​లో నెట్​ ఆఫ్​ చేస్తే వాట్సాప్​ వెబ్​ పనిచేయదు. ఇంటర్నెట్​​ కనెక్టివిటీ లేకుంటే వాట్సాప్​ వెబ్​లో మెసేజ్​లు పంపినా అవతలి వ్యక్తికి డెలివరీ కావు.

కానీ ఇకపై ఆ సమస్య ఉండదని చెబుతోంది వాట్సాప్​. ఒక్కసారి మీ ఫోన్​తో వాట్సాప్​ వెబ్​ కనెక్ట్​ చేసి ఆ తర్వాత నెట్​​ ఆఫ్ చేసినా సరే కంప్యూటర్​లో దాన్ని వాడుకోవచ్చని చెబుతోంది. ఇలా ఫోన్​లో నెట్​ ఆన్​ చేయకుండా 14 రోజుల పాటు నిరాటంకంగా వాట్సాప్​ వెబ్​ వాడేయొచ్చని స్పష్టం చేసింది. దీని ద్వారా కేవలం మెసేజ్​లు పంపడమే కాదు.. వాట్సాప్​ ఆడియో, వీడియో కాల్స్​ కూడా చేసుకోవచ్చు. అయితే, 14 రోజుల తర్వాత ఆటోమేటిక్​గా వాట్సాప్​ లాగౌట్ అయిపోతుంది.

స్మార్ట్‌ఫోన్ లేకుండా వాట్సాప్ వెబ్‌ను ఎలా ఉపయోగించాలి?

మందుగా మీ స్మార్ట్​ఫోన్​ను వెబ్, డెస్క్‌టాప్ లేదా పోర్టల్‌కు లింక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్​ లేకుండానే కంప్యూటర్​ లేదా ల్యాప్​టాప్​పై 14 రోజుల పాటు వాట్సాప్​ వెబ్​ను వినియోగించుకోవచ్చు.

  • మీ స్మార్ట్​ఫోన్లో వాట్సాప్​ యాప్​ను ఓపెన్​ చేయండి. ఆ తర్వాత స్క్రీన్ రైట్ టాప్ లో ఉన్న మూడు చుక్కల సింబల్ పై నొక్కండి.
  • ఆ తర్వాత “లింక్డ్​ డివైజెస్​” పై క్లిక్​ చేయండి. ఆపై “మల్టీ-డివైస్ బీటా” పై నొక్కండి. వెంటనే వాట్సాప్​ ఫీచర్​ను వివరించే పేజీ డిస్​ప్లే అవుతుంది.
  • ఇప్పుడు, “జాయిన్​ బీటా” బటన్‌పై క్లిక్​ చేయండి. ఆ తర్వాత “కంటిన్యూ” బటన్‌పై నొక్కండి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక QR కోడ్‌ని స్కాన్ చేసి మీ స్మార్ట్‌ఫోన్‌ను వాట్సాప్​ వెబ్‌కి లింక్ చేయండి. కాగా

ఏ పరిస్థితుల్లో ఈ ట్రిక్ పని చేయదంటే :

  • వాట్సాప్​ చాలా పాత వెర్షన్​ ఉపయోగిస్తున్న డివైజెస్​లో ఈ ఫీచర్​ పనిచేయదు.
  • అలాగే ప్రైమరీ ఐఫోన్​ డివైజ్​లలో కూడా పనిచేయదు. కాబట్టి, మీ వాట్సాప్​ను కొత్త వెర్షన్​కు అప్​డేట్​ చేసుకోండి.
  • వాట్సాప్ లింక్ అయిన డివైజ్‌ల్లో లైవ్ లొకేషన్ ఆప్షన్ పనిచేయదు.
  • వెబ్ నుంచి లింకైన డివైజ్‌ల్లో క్రియేట్ చేయడం/బ్రాడ్కాస్ట్ లిస్ట్ (Broadcast list) వీక్షించడం వంటి మెసేజ్‌లు, లింక్ ప్రివ్యూలకు సపోర్ట్ చేయదు.

Related posts

Whatsapp: మరో కొత్త ఫీచర్‌తో వాట్సప్‌.. లాస్ట్‌ సీన్‌ అనుమతించిన వారికి మాత్రమే

Hardworkneverfail

WhatsApp Pay: అదిరిపోయే ఆఫర్‌..! ఒక్క రూపాయి పంపించినా.. రూ. 50క్యాష్‌ బ్యాక్‌.!

Hardworkneverfail

వాట్సాప్‌లో సెల్ఫ్ చాట్ ఫీచర్ గురించి మీకు తెలుసా ?

Hardworkneverfail

WhatsApp New update: యూజర్స్ కి మరో అదిరిపోయే అప్డేట్ తో వాట్సాప్..!

Hardworkneverfail