Mega Power Star Ram Charn Movie Updates : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మాణంలో మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల పూణే లో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. చెర్రీ, కియారా అద్వానీ పై ఓ పాట, కొన్ని కీలక సన్నివేశాలు ఈ షెడ్యూల్ లో షూట్ చేయబోతున్నారు. రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’, చిరంజీవి ‘ఆచార్య’ మూవీలకి సంబంధించి తన వర్క్ కంప్లీట్ చేసిన రామ్ చరణ్ .. ఇప్పుడు శంకర్ మూవీపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇందులో చరణ్ ఐఏయస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో, ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ మూవీ ఉండబోతోందట.
ఇక ఈ మూవీకి సంబంధించిన ఓ లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం #RC15 సరికొత్త రికార్డు సృష్టించింది. మూవీ ఫస్ట్‌లుక్ మరియు టైటిల్‌ను రివీల్ చేయకముందే థియేట్రికల్, శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ ను జీ స్టూడియోస్ వారు భారీ మొత్తానికి కొనుగోలు చేశారట.
జీ స్టూడియోస్ ఈ మూవీ థియేట్రికల్, శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ ను కలిపి అన్ని భాషలకు గాను దాదాపు 350 కోట్ల రూపాయలకు డీల్ సెట్ చేసుకుంది జీ సంస్థ. ఇంకా రీమేక్ రైట్స్, ఆడియో రైట్స్ ను దిల్ రాజు అమ్ముకోవచ్చు. సో, ఏ రకంగా చూసినా కూడా దిల్ రాజు సేఫ్ అయినట్లే. మంచి డీల్ రావడంతో ఇక దిల్ రాజు ఏ చీకూ చింత లేకుండా ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకోవచ్చు. ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కి జీ స్టూడియోస్ నిధులు సమకూరుస్తోందని కూడా ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం దర్శకుడు శంకర్, జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో రామ్ చరణ్ మరియు కియారా అద్వానీలపై సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఈ పాట #RC15 మూవీ లో హైలెట్ గా ఉంటుందని తెలుస్తోంది.
RRR Movie Release Date Postponed : మూవీ ఇండస్ట్రీకి కరోనా దెబ్బ మరోసారి గట్టిగా తగిలింది. 2021 కరోనా వలన మూవీ ఇండస్ట్రీ ఇబ్బంది పడ్డ సంగతి తెలిసిందే. థియేటర్లు మూసివేయడం, షూటింగ్లు ఆగిపోవడం, ప్రముఖులు కరోనా బారిన పడడం ఇలా ఒకటేమిటి మూవీ ఇండస్ట్రీకి చెప్పుకోలేనంత నష్టం వాటిల్లింది. ఇక కొత్త సంవత్సరంలోనైనా కరోనా పోయి థియేటర్లు అవ్వడంతో మూవీ ఇండస్ట్రీ కోలుకొంటుంది అనుకున్నారు. కానీ కరోనా మరోసారి ఊహించని రీతిలో థర్డ్ వేవ్ తో విజృంభించనుంది.. దీంతో థియేటర్లను మరోసారి మూసి వేసే పరిస్థితి ఏర్పడింది. అందువలన చాలా మూవీస్ రిలీజ్ వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కింది. ఈ మూవీ ఇప్పటికి మూడు సార్లు వాయిదా పడింది. కొన్ని అనుకోని కారణాల వలన ఒక్కసారి వాయిదా పడితే కరోనా కారణంగా మరో రెండు సార్లు వాయిదా పడింది. ఇక ఈసారి ఎట్టి పరిస్థితిలోను ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసి జనవరి 7 న రిలీజ్ డేట్ ని ప్రకటించి, ప్రమోషనలను సైతం కానిచ్చేసి ఇక బుకింగ్ కూడా వరల్డ్ వైడ్ గా ప్రారంభించారు. కానీ దేశంలో కరోనా వ్యాప్తి మరోసారి కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఒమిక్రాన్ విజృంభణతో ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి.
దీంతో ఈ మూవీ మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని ‘ఆర్ఆర్ఆర్’ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కొన్నిసార్లు పరిస్థితులు మన చేతులలో ఉండవు.. దేశంలోని చాలా రాష్ట్రాల్లో థియేటర్లను క్లోజ్ చేస్తున్నారు. మాకు వేరే దారి లేక మేము ఈ పనిని చేస్తున్నాము. కానీ మేము మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నాము.. ఈ మూవీపై ఉన్న అంచనాలను అలాగే ఉంచమని కోరుతున్నాము. మీకు ప్రామిస్ చేస్తున్నాము.. మంచి సమయంలో ఈ మూవీని రిలీజ్ చేస్తాం” అంటూ చెప్పుకొచ్చారు.
RRR Team Confirms New Release Date : దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో అత్యంత భారీ ఎత్తున పాన్ ఇండియా లెవల్ లో భారీగా సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ 3rd వేవ్ ఎంటర్ అవ్వడంతో ఇక తప్పక మరోసారి పోస్ట్ పోన్ అవ్వాల్సి వచ్చింది.
ఇక మూవీ ఎప్పుడు వస్తుందో అన్న క్లారిటీ కూడా లేని టైం లో ఒకటి కాదు ఏకంగా రెండు రిలీజ్ డేట్లు ప్రకటించి ఔరా అనిపించారు. బాక్స్ ఆఫీస్ దగ్గర పరిస్థితులు త్వరలో అన్నీ సద్దుకుంటే మార్చి 25న ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ చేస్తామని డేట్స్ ని లాక్ చేశారు మూవీ మేకర్స్. అన్నీ అనుకున్నట్లు జరిగి మార్చి 25న ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ అయ్యి రికార్డులు తిరగరాయాలని కోరుకుందాం.
RRR Movie OTT Release : ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఓటీటీలో వచ్చేది ఎప్పుడంటే…?
రామ్‌చరణ్, ఎన్టీఆర్ నటించిన మల్టీ స్టార్రర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 9న విడుదలైన ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఈ మూవీ ట్రైలర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకుల అంచనాల మేరకు ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీ ఓటీటీలో ఎప్పుడు వస్తుందనే విషయంపైనా పలువురు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
ఈ మధ్య కాలంలో చాలా మూవీస్ 4 వారాల్లోనే ఓటీటీల్లో వచేస్తున్నాయి. దీంతో ఆర్ఆర్ఆర్ మూవీ కూడా నాలుగు వారాల్లో ఓటీటీలో వస్తుందని చాలా మంది భావించారు.. కానీ షాకిచ్చే న్యూస్ చెప్పారు మూవీ మేకర్స్. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ థియేటర్లలో విడుదలైన 3 నెలల వరకు ఓటీటీలో విడుదల కాదని మూవీ మేకర్స్ స్పష్టం చేశారు. బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ పెన్ స్టూడియోస్ సంస్థ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఆల్ లాంగ్వేజెస్ హక్కులను దక్కించుకుంది. తెలుగు ఓటీటీ హక్కులను జీ5 మరియు హిందీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థలు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.