సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా మారుతీ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ ‘మంచి రోజులు వచ్చాయి’. దీపావళి సందర్భంగా నవంబర్ 4న విడుదలయ్యింది. అప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలకి ప్రేక్షకుల నుండీ మంచి స్పందన లభించింది. దాంతో ఈ మూవీకి బిజినెస్ కూడా బాగానే జరిగింది. కానీ మూవీ మెప్పించలేకపోయింది. దాంతో బయ్యర్లకి రూ.5 కోట్ల పైనే నష్టాలు వాటిల్లినట్టు తెలుస్తుంది.
ఇక అది అలా ఉంటే ఈ మూవీ ఇప్పుడు వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ఆహా వీడియో సొంతం చేసుకుంది. ఈ మూవీ డిసెంబర్ 3 వ తేదీన ఆహా వీడియో లో స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఆహా అధికారికంగా ప్రకటించింది. దాంతో స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Manchi Rojulu Vacchesthunnayiiii! You’re all going to be laughing your heart out with this one ♥️😄 Premieres Dec 3.#ManchiRojulochaie #MRVOnAHA@santoshshobhan @Mehreenpirzada @harshachemudu @DirectorMaruthi @vennelakishore @Satyamrajesh2 @IamSaptagiri @SKNonline @anuprubens pic.twitter.com/cUyqnMMv8H
— ahavideoIN (@ahavideoIN) November 24, 2021