‘మా’ ఎన్నికల నేపథ్యంలో సినీ నటుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలపై మా అధ్యక్ష అభ్యర్థి మంచు విష్ణు స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. చిరంజీవి అంటే తనకు ఎంతో గౌరవమని, మిమ్మల్ని విమర్శిస్తే, ఆయనను విమర్శించినట్లు అవుతుందని అన్నారు. అందుకే తాను నాగబాబుపై విమర్శలు చేయనని చెప్పారు.
తెలుగు భాష కంటే.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడికి క్యారెక్టర్ చాలా ముఖ్యమని.. కాబట్టి ఎవరి క్యారెక్టర్ ఎలాంటిదో పరీక్ష పెడితే బాగుంటుందని నాగబాబుకు సూచించారు. “వ్యక్తిగతంగా క్యారెక్టర్ లో మార్కులు వేయాలనుకుంటే నాకు నూటికి ఎన్ని మార్కులొస్తాయో ఇండస్ట్రీలో అడగండి. ఆయనకు (ప్రకాష్ రాజ్) ఎన్ని మార్కులొస్తాయో.. ఆయనతో నటించిన తోటి నటీనటుల్ని, దర్శకుల్ని అడగండి. మన భాషలోనే కాదు, ఆయన నటించిన అన్ని భాషల్లో ఆయన క్యారెక్టర్ గురించి అడగండి. క్యారెక్టర్ లేని నాలెడ్జ్ పనికిరాదు.” నరేంద్రమోడీని విమర్శించేంత మేధానిగా ప్రకాష్ రాజ్ ను నాగబాబు అభివర్ణించారని, ట్విట్టర్ ఓపెన్ చేస్తే, ప్రకాష్ రాజ్ లానే వేలమంది పిచ్చుకలు ట్విట్టర్ లో విమర్శలు చేస్తుంటారని ఎద్దేవా చేశాడు మంచు విష్ణు.