అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’. ‘జీఏ2 పిక్చర్స్’ పతాకంపై బన్నీ వాస్, వాసు వర్మ నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల అయ్యింది. దసరా సెలవు కూడా కలిసి రావడంతో సూపర్ ఓపెనింగ్స్ ను సాధించింది. ఈ మూవీ మంచి ఓపెనింగ్సే నమోదయ్యాయి. దాంతో మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకుంది.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ మూవీ ఫస్ట్ వీక్ వచ్చిన షేర్ :
నైజాం | 7.01 cr |
సీడెడ్ | 3.70 cr |
ఈస్ట్ | 1.10 cr |
వెస్ట్ | 0.90 cr |
ఉత్తరాంధ్ర | 2.16 cr |
గుంటూరు | 1.25 cr |
నెల్లూరు | 0.75 cr |
కృష్ణా | 0.98 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 17.86 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 3.60 cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 21.46 cr |
అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీకి రూ.19 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు రూ.19 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఈ మూవీ ఫస్ట్ వీక్ తర్వాత ఇప్పుడు 2.46 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని క్లీన్ హిట్ నుండి ఇప్పుడు సూపర్ హిట్ గా కొనసాగిస్తూ రెండో వారంలో అడుగు పెట్టింది, మరి రెండో వారంలో ఈ మూవీ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.